వైభవంగా శ్రీవేణుగోపాలస్వామి కల్యాణం


Sun,June 16, 2019 03:06 AM

కలెక్టరేట్‌: పెద్దపల్లి మండలం మారేడుగొండలోని శ్రీవేణుగోపాలస్వామి ఆలయంలో తిరు కల్యాణ మహోత్సవాల్లో భాగంగా శనివారం రుక్మిణి సత్యభామ-శ్రీవేణుగోపాలస్వామి కల్యాణాన్ని నిర్వాహకులు వైభవోపేతంగా నిర్వహించారు. ఈ నెల 13 నుంచి ప్రారంభమైన శ్రీవేణుగోపాల స్వామి ధ్వజారోహణ తిరు కల్యాణ మహోత్సవాల్లో భాగంగా స్వామి కల్యాణాన్ని చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు కాం డూరి శ్రీనివాసాచార్యులు, కాండూరి శ్రీకాంతాచార్యులు, యజ్ఞాచార్యులు కొండపాక నర్సింహాచార్యుల ఆధ్వర్యంలో స్వామి వారి వివాహాన్ని చేశారు. ధర్మకర్తలు కీసరి రంగారెడ్డి, కీసరి జయరామ్‌ రెడ్డి పర్యవేక్షణలో తిరు కల్యాణ వేడుకలను చేపడుతున్నారు. కల్యా ణ మహోత్సవంలో భాగంగా ఉదయం సేవాకాలం ప్రబోధికి నివేదనతో ప్రారంభమైన పూజా ది కార్యక్రమాలు, సాయంత్రం విష్ణు సహస్ర నామ పారాయణం అనంతరం శ్రీవారి రుక్మిణి సత్యభామ-శ్రీవేణుగోపాల స్వామి కల్యాణ మహోత్సవ ఘట్టం చేపట్టారు. కార్యక్రమం లో సర్పంచ్‌ కన్నం జయ్‌, ఎంపీటీసీ సభ్యుడు మాదిరెడ్డి తిరుపతిరెడ్డి తదితరులున్నారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...