నకిలీవి అమ్మితే కఠిన చర్యలు


Sun,June 16, 2019 03:06 AM

ఓదెల: నకిలీ విత్తనాలు, ఫర్టిలైజర్లు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని పెద్దపల్లి ఏడీఏ క్రిష్ణారెడ్డి హెచ్చరించారు. ప్రస్తుతం ఖరీఫ్‌ వ్యవసాయ సీజన్‌ ప్రారంభమవుతుండడంతో ఫర్టిలైజర్‌ డీలర్లతో ఓదెలలోని వ్యవసాయ కార్యాల యంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పోలీస్‌, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో నిఘా కూడా పెంచారని పేర్కొన్నారు. నాణ్యమైన విత్తనాలు, ఫర్టిలైజర్స్‌ అమ్మాలనీ, ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైనందున రైతులకు ఇబ్బందులు కల్గించకుండా సీడ్స్‌, ఫర్టిలైజర్స్‌ అందుబాటులో ఉండేలా చూసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏఓ నాగార్జున, ఏఈఓలు సంధ్య, కిరణ్‌, సతీశ్‌, స్వప్న తదితరులు పాల్గొన్నారు.
కాల్వశ్రీరాంపూర్‌ : నకిలీ విత్తనాలు, పురుగు మందులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని పెద్దపల్లి ఏడీఏ కృష్ణారెడ్డి హెచ్చరించారు. మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో శనివారం ఎరువులు, పురుగు మందుల దుకాణ దారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఏడీఓ మాట్లాడారు. నకిలీవి అమ్మితే డీలర్ల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఓ నాగార్జున , ఏఈఓలు రాజు, రమేశ్‌, పూర్ణచందర్‌, తదితరులు పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...