పాడి పరిశ్రమతో అధిక దిగుబడులు


Sat,June 15, 2019 02:53 AM

సుల్తానాబాద్‌రూరల్: పాడి పరిశ్రమతో అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి డాక్టర్ రాజన్న అన్నారు. మండలంలోని సుద్దాల గ్రామంలో పాల ఉత్పత్తిదారుల సంఘం ఆవరణలో శుక్రవారం కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు మినుపాల సుధాకర్‌రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జేడీఏ డాక్టర్ రాజన్న పాల్గొని మాట్లాడారు. గతంలో కంటే పాల ఉత్పత్తి పెరిగిందని, దానికి అనుగుణంగా సంఘాలు పని చేస్తున్నాయన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను పాల ఉత్పత్తిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గడ్డి విత్తనాలపై 50 శాతం సబ్సిడీ ఉందని, అవసరమున్న రైతులు తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం అధ్యక్షుడు మినుపాల సుధాకర్‌రావు పాల కొనుగోలు, దానా కొనుగోలు, మినరల్ మిక్చర్ కొనుగోలు, విత్తనాల కొనుగోలు, వ్యాక్సిన్ కొనుగోలు, లెక్కల రుసుము, ఆడిట్ ఫీజు, బెయిఫ్, బ్యాంకు చార్జీలు, క్యాన్ల ఖర్చులు, చెక్కుల ఖర్చులు, తరుగుదల, ఎలక్ట్రిసిటీ ఖర్చులు, ఈఎంటీ, కెమికల్స్, రిపేర్లు మొదలైన ఖర్చులు, ఇతర మినహాయింపులు, పాలనిధి, మరమ్మతులు, జీతభత్యాలు, సంక్రాంతి ఖర్చులు, సంస్థ రికవరీ, స్టేషనరీ ఖర్చులు మొదలైన వాటిపై పాల ఉత్పత్తిదారులకు వివరించారు.

మార్చి 2018-19 సంవత్సరానికి 9,169 లీటర్ల పాలను పోసి బోనస్‌గా రూ.18,338 మొదటి బహుమతిగా తీసుకున్న మినుపాల రామారావును అధికారులు, సంఘసభ్యులు ఘనంగా సన్మానం చేసి బోనస్ అందజేశారు. జేడీఏ డాక్టర్ రాజన్న, నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ నిర్మలను పాలకవర్గ సభ్యులు వేర్వేరుగా శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ఒజ్జ సంపత్ యాదవ్, పాలకవర్గ సభ్యులు కాసర్ల సురేందర్‌రెడ్డి, అల్లాడి రవీందర్‌రావు, పీహెచ్ రవీందర్‌రెడ్డి, ఒజ్జ గట్టయ్య, వివరంనేని అమ్మాయి, సరీన్‌రావు, ఎరవెల్లి రవీందర్‌రావు, వివరంనేని స్వరూపారాణి, అశోక్‌రావు, పాల ఉత్పత్తిదారులతోపాటు తదితరులు పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...