ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి


Sat,June 15, 2019 02:53 AM

కాల్వశ్రీరాంపూర్ : పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరుతూ ఆయా గ్రామాల్లో ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు. మండల కేంద్రంతో పాటు , కిష్టంపేట, ఇద్లాపూర్, మడిపల్లి కాలనీలో శుక్రవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరుగుతూ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు.

సుల్తానాబాద్‌రూరల్: మండలంలోని అన్ని గ్రామాల్లో శుక్రవారం బడిబాట ర్యాలీలు తీశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లోని వీధుల్లో తిరుగుతూ బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన ఎంపీపీ బాలాజీరావు, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షురాలు వీరగోని సుజాత, సర్పంచులు అనిత, లావణ్య, కోమలత, రవీందర్‌రెడ్డి, ఆర్నకొండ రాజు, ప్రధానో పాధ్యాయులు మాధవి లత, తులా సుధాకర్‌రావు, రఘు కిశోర్, నాయకులు వీరగోని రమేశ్‌గౌడ్, వడ్కాపురం ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

జూలపల్లి : జూలపల్లి, ఎలిగేడు మండలాల్లో బడీడు పిల్లల్ని బడుల్లో చేర్పించాలని కోరుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ఇంటింటా పర్యటించి తల్లిదండ్రులకు కర పత్రాలు అందజేశారు.ఇక్కడ ఎంఈఓ కవిత, సర్పంచులు, పాత, కొత్త ఎంపీటీసీ సభ్యులు, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు తదితరులున్నారు.

ధర్మారం: ధర్మారం, నర్సింహులపల్లి, కొత్తూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ఆధ్వర్యంలో విద్యార్థులతో స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు బడిబాట ర్యాలీలు తీశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఫ్లకార్డులు ప్రదర్శించారు. బడీడు పిల్లలంతా సర్కార్ బడిలో చేరాలని విద్యార్థులు నినాదాలు చేశారు. గోపాల్‌రావుపేట, కమ్మర్‌ఖాన్‌పేటల్లో ప్రాథమికోన్నత పాఠశాల ఆధ్వర్యంలో, సాయంపేట, నందిమే డారంల్లో ప్రాథమిక పాఠశాలల ఆధ్వర్యంలో బడిబాట ర్యాలీలు నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఇంటింటా తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేశా రు. కార్యక్రమంలో హెచ్‌ఎంలు పినుమళ్ల ఛాయాదేవి, వీవీ సత్యనారాయణ, మంజులాదేవి, జలపతి, జాడి శ్రీనివాస్, అత్తె రాజారాం, సర్పంచులు పి. జితేందర్‌రావు, జనగామ అంజయ్య, గుజ్జుల రమ, అడువాల అరుణ జ్యోతి, తాళ్లపల్లి మల్లేశం, నూతన జడ్పీటీసీ పద్మజ, వైస్ ఎంపీపీ మేడవేని తిరుపతి, ఎంపీటీసీ సభ్యుడు తుమ్మల రాంబాబు, ఉప సర్పంచులు ఆవుల లత, సతీశ్‌రెడ్డి, రాజేశ్వరి, విద్యా కమిటీ చైర్మన్లు సందినేని పోచం, బుర్ర చందు, వార్డుసభ్యుడు గుజ్జుల వేణుగోపాల్‌రెడ్డి, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.

కలెక్టరేట్: పెద్దపల్లిలో ఉపాధ్యాయులు, చిన్నారులతో కలిసి బడిబాట ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి మున్సిపల్ కౌన్సిలర్ల ఫోరం అధ్యక్షుడు ఉప్పు రాజు హాజరై మాట్లాడారు. అలాగే పెద్దపల్లి మండలం పెద్దకల్వల, మూలసాలతో పాటు పలు గ్రామాల్లో ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు బడిబాట కార్యక్రమంలో పాల్గొని ర్యాలీలు తీసి, విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచులు, ఉపాధ్యాయులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...