పీహెచ్‌సీ సిబ్బందిపై ఫిర్యాదు


Sat,June 15, 2019 02:53 AM

ధర్మారం: ధర్మారం మండలం నందిమేడారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది వైద్యం కోసం వచ్చిన వారిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఎంపీటీసీ సభ్యుడు మిట్ట తిరుపతి వైద్య ఆరోగ్యశాఖాధికారులకు శుక్రవారం ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పీహెచ్‌సీకి వైద్యం కోసం వచ్చే వారు సి బ్బంది పనితీరుపై తన దృష్టికి తీసుకురాగా, ఉన్నతాధికారులకు ఫి ర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఇదే విషయాన్ని పీహెచ్‌సీని సందర్శించి అక్కడున్న పరిస్థితిని ఫోన్ ద్వారా జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారికి ఫిర్యాదు చేశారు. స్పందించిన డీఎంహెచ్‌ఓ జిల్లా కేంద్రం నుంచి వైద్యు డు కిశోర్‌ను పీహెచ్‌సీకి పంపించి పరిస్థితిని ఆరా తీయగా సంబంధిత వైద్యుడు, సిబ్బందిపై ఎంపీటీసీతో పాటు పలువురు స్థానికులు ఫిర్యాదు చేశారు. స్థానిక హెచ్‌డీఈఓ మద్యం తాగి విధులకు హాజరవుతున్నాడని, పలుమార్లు ఉన్నతాధికారులకు విషయాన్ని చెప్పి మందలించినా ఆయనలో మార్పు రాలేద న్నారు. ప్రభు త్వం వైద్యశాలలను మెరుగుపర్చి ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని చూస్తుంటే సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తిరుపతి ఆరోపించారు. ఇక్కడ నాయకులు మిట్ట రాజయ్య తదితరులున్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...