క్షేత్రస్థాయిలో భూ సమస్యల పరిష్కారం


Sat,June 15, 2019 02:53 AM

ధర్మారం: క్షేత్రస్థాయిలో భూ సమస్యలు పరిష్కరించాలని సంకల్పించినట్లు ధర్మారం తాసీల్దార్ సంపత్ తెలిపారు. ఈ మేరకు ఆయన రెవెన్యూ కార్యాలయంలో శుక్రవారం మాట్లాడారు. ప్రయోగాత్మకంగా పైడిచింతలపల్లి, రచ్చపల్లి, రామయ్యపల్లిని ఎంపిక చేశామని తెలిపారు. ఇందులో భాగంగా గురువా రం నుంచి పైడిచింతలపల్లిలో రెవెన్యూ శాఖ అధ్వర్యంలో ప్రత్యేకంగా సదస్సును ఏర్పాటు చేశామన్నారు. రైతుల నుంచి దరఖాస్తులు వచ్చాయనీ, వాటిపై విచారించి ఆధారాలు ఉన్న వాటిని పరిష్కరిస్తామన్నారు. అనం తరం రైతుబంధు ఆర్థిక సాయం పొందే వీలు కల్పిస్తామని వివరించారు. ఎంపిక చేసిన ఒక్కో గ్రామంలో మూ డు రోజుల పాటు తమ శాఖ సిబ్బంది ఉండి రైతుల నుంచి భూ సమస్యల ఆర్జీలను స్వీకరిస్తారని తెలిపారు. తాను సైతం తనిఖీ చేస్తానని చెప్పారు. పైడిచింతలపల్లి, రచ్చపల్లి, రామయ్యపల్లి రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇప్పటికి భూ దస్ర్తాల ప్రక్షాళన 95 శాతం పూర్తయిందని వివరించారు. మిగతా వాటిని కొంత సమయం తీసు కొని పరిష్కారం చేస్తామని తెలిపారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...