ఎన్టీపీసీలో లోకోమోటీవ్ ప్రారంభం


Sat,June 15, 2019 02:52 AM

జ్యోతినగర్: రామగుండం ఎన్టీపీసీలో బొగ్గు దిగుమతికి నూతనంగా వారణాసి నుంచి దిగుమతి చేసుకున్న లోకోమోటీవ్(బొగ్గు రైలు ఇంజిన్)ను శుక్రవారం రామగుండం ఎన్టీపీసీ, తెలంగాణ ప్రాజెక్టు ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ డాక్టర్ పీపీ కులకర్ణి ప్రారంభించారు. ఈ మేరకు ప్లాంటులోని ఎంజీఆర్ విభాగం వర్కుషాప్‌లో జీఎంలతో కలిసి ఈడీ కొబ్బరికాయ కొట్టి, రిబ్బన్ కట్ చేసి రైలు ఇంజిన్‌ను ఆపరేటింగ్ చేశారు. అనంతరం ఈడీ విధి నిర్వహణపై ఎంజీఆర్ విభాగాన్ని అభినందించి, పని ప్రదేశాల్లో అప్రమత్తగా వ్యవహరిస్తూ ప్రమాద రహితంగా పనులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. భద్రతా ప్రాముఖ్యతను ఉద్యోగులకు వివరించారు. ప్లాంటులో కొత్త రైలు ప్రవేశంలో బొగ్గు దిగుమతికి గాను రైలు ఇంజిన్ల సంఖ్య 12కు చేరింది. స్టేజీ-2 యూనిట్లకు సంబంధించి ఆర్‌అండ్‌ఎం బడ్జెట్ నుంచి కొనుగోలు చేసిన ఈ కొత్త రైలు ఇంజిన్ డబ్ల్యూడీజీ3ఏ నూతన సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన రైలు ఇంజిన్. కార్యక్రమంలో ఎన్టీపీసీ చీఫ్ జనరల్ మేనేజర్ మాథ్యూ వర్గీస్, మెయింటెన్సీ జీఎం సౌమేంద్ర దాసు, ఎంజీఎం(ఎంజీఆర్) ఎం రవికుమార్, ఉన్నతాధికారులు ఉన్నారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...