రైలు కింద పడి యువకుడు మృతి


Sat,June 15, 2019 02:52 AM

సుల్తానాబాద్‌రూరల్: మండలంలోని కందునూరిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని హనుమాండ్లపల్లి గ్రామానికి చెందిన చొప్పరి అజయ్ (28) తమిళనాడు రాష్ట్రంలోని కానిపాడులో బుధవారం రాత్రి రైలు కిందపడి మృతి చెందాడు. గ్రామస్తులు, కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. అజయ్ కుటుంబ సభ్యులతో కలిసి నిమిత్తం తిరుపతి, గోల్డెన్ టెంపుల్‌కు వెళ్లాడు. దర్శనం అనంతరం గోల్డెన్ టెంపుల్ నుంచి తిరుగు ప్రయాణంలో రైలులో రద్దీ ఎక్కువగా ఉండడంతో ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు జారిపడడంతో అక్కడికక్కడే మృ తి చెందా డు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని శనివారం స్వగ్రామానికి తీసుకురానున్నారు. అజయ్‌కు భార్య సుజాత, కూతురు, కొడుకు ఉన్నారు.

86
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...