కేసీఆర్ ఆశయం గొప్పది


Fri,June 14, 2019 02:28 AM

మేడిపల్లి: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని వేములవాడ, జగిత్యాల ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేశ్‌బాబు, డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. మండలంలోని తొంబర్రావుపేట గ్రామశివారులోగల ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాలువపై రూ.40 లక్షల నిధులతో నిర్మించే డీ 52 ఓటీ స్లూయిజ్ పనులకు ఎమ్మెల్యేలు రమేశ్‌బాబు, సంజయ్‌కుమార్, జడ్పీ చైర్‌పర్సన్ దార వసంత భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రతి ఎకరానికి నీరు అందించాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయం గొప్పదని పేర్కొన్నారు. సేవ చేసిన వారిని మరిచిపోవద్దనీ, ఆనాడు ఎంపీగా ఉన్న కల్వకుంట్ల కవిత డీ52 ఓటీ స్లూయిజ్‌పై లేఖ ఇచ్చి నిధుల మంజూరుకు కృషి చేశారని గుర్తు చేశారు. అలాగే ఎమ్మెల్యే రమేశ్‌బాబు కృషి ఉన్నదని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో చెరువుల గురించి పట్టించుకోలేదని విమర్శించారు. డీ 52 స్లూయిజ్ ద్వారా మేడిపల్లి, రాయికల్ మండలాల్లోని వెయ్యి ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు మాట్లాడుతూ.. గ్రామాల్లోని ప్రతి చెరువును నీటితో నింపి మేడిపల్లి, కథలాపూర్ మండలాలను సస్యశ్యామలం చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. వేములవాడ, చందుర్తి మండలాల్లోని 40వేల ఎకరాలకు గోదావరి జలాలు అందించామనీ, ఎల్లంపల్లి, వరద కాలువ ద్వారా మేడిపల్లి, కథలాపూర్ మండలాల్లోని 70వేల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేలు రమేశ్‌బాబు, సంజయ్‌కుమార్, జడ్పీ చైర్‌పర్సన్ దార వసంత, జడ్పీ వైస్ చైర్మన్ వొద్దినేని హరిచరణ్‌రావులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. కొడిమ్యాల మండలంలోని పోతారం పంప్‌హౌజ్, సూరంపేట పైప్‌లైన్‌లకు కవర్‌వాల్‌లను ఎమ్మెల్యే రమేశ్‌బాబు మార్క్‌ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డితో కలిసి పరిశీలించారు. కార్యక్రమాల్లో జడ్పీటీసీ సభ్యులు నెల్లుట్ల పూర్ణిమ, నాగం భూమయ్య, ఎంపీపీ కుందారపు అన్నపూర్ణ, మండల ఉపాధ్యక్షుడు దొంతి శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వినోద్‌కుమార్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సత్యనారాయణ, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎంజే ఫేరస్ జస్మీన్, సర్పంచులు గడ్డం నారాయణరెడ్డి, మామిడి సత్తమ్మ, తౌటి తిరుపతిరెడ్డి, ద్యావనపెల్లి అభిలాశ్, సింగిల్‌విండో చైర్మన్ మిట్టపెల్లి భూమారెడ్డి, బాజోజి చారి, వంగ వెంకటేశం, ఎంపీటీసీ సభ్యులు చెన్నమనేని రవీందర్‌రావు, మకిలి దాస్, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు సుదవేని గంగాధర్, నాయకులు పొలాస నరేందర్, కాటిపెల్లి శ్రీపాల్‌రెడ్డి, నెల్లుట్ల ప్రభాకర్, కుందారపు రవీందర్, లోలపు రాజరెడ్డి, పన్నాల రాజేశ్వర్‌రెడ్డి, నల్ల మహిపాల్‌రెడ్డి, దోనకంటి రాజరత్నాకర్‌రావు, గౌరి భూమయ్య, వీరబత్తని ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...