బోనమెత్తిన పల్లెలు


Fri,June 14, 2019 02:25 AM

జగిత్యాల రూరల్/ సారంగాపూర్ : జగిత్యాల మండలం ఎలుకబావి వాడ లింగంపేటలో ఉడుగుల పోచమ్మ బోనాల పండగను గురువారం ఘనంగా నిర్వహించారు. మహిళలు ఇంటికో బోనం చొప్పున నెత్తిన బోనాలు ఎత్తుకొని డప్పుల చప్పుళ్ల నడుమ భారీ ఊరేగింపుగా ఆలయానికి తరలివెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సిరికొండ లక్ష్మణ్, చింతకింది నరేశ్, సిరికొండ ధర్మయ్య, ద్యాగల వెంకటనర్సయ్య, నవీన్, సిరికొండ చిరంజీవి, రెడ్డి, ప్రవీణ్, రమేశ్, ఉదయ్ కిరణ్, కొత్తూరి దేవేందర్ పాల్గొన్నారు. మోరపెల్లిలో అంబేద్కర్ సంఘం, జైభీమ్ యూత్ సంయుక్త ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు తీశారు. సారంగాపూర్ మండలం ఒడ్డెర కాలనీలో పోచమ్మ బోనాలు తీశారు. పిల్లాపాపలు, పాడిపంటలు బాగుండాలనీ, గ్రామాన్ని చల్లాగా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. సర్పంచ్ పల్లపు వెంకటేశ్, ఉప సర్పంచ్ పోగుల మాధవి, పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...