కేటీఆర్ చొరవతో యువతికి విముక్తి


Thu,June 13, 2019 03:45 AM

-గల్ఫ్‌లో షేక్ చెరలో చిక్కుకుని నరకయాతన
-ఎమ్మెల్యే రామన్న జోక్యంతో క్షేమంగా స్వదేశానికి
-కృతజ్ఞతలు తెలిపిన బాధితురాలు, కుటుంబసభ్యులు
వీర్నపల్లి: సౌదీలోని ఓ షేక్ చెరలో చిక్కుకొని నరకయాతన అనుభవిస్తున్న యువతీకి విముక్తి లభించింది. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ చొరవతో స్వదేశానికి క్షేమంగా చేరుకుంది. గ్రామస్తులు తెలిపిన కథనం ప్రకా రం.. రాజన్న సిరిసిల్ల జిల్లా అడవిపదిర గ్రామానికి చెందిన రెడ్డిపల్లి లావణ్య హైదరాబాద్‌లో నర్సింగ్ కోర్సును పూర్తిచేసింది. ఆనంతరం 2015 సౌదీకి వెళ్లింది. కొద్ది కాలం అక్కడ పనిచేసి 2016 భారత్ కు తిరిగివచ్చింది. ఆరునెలల క్రితం మరోసారి విజిట్ వీసాపై సౌదీకి చేరుకొని ఓ షేక్ ఇంట్లో పనికి కుదిరింది. వీసా గడువు ము గియడంతో స్వదేశానికి రావాల్సి ఉంది. అయినప్పటికీ సదరు యజమాని నిర్భందించి రోజుకు 18 గంటలు పని చేయించి, ఆయన బంధువుల ఇండ్లలోనూ పని చేయించి తీవ్ర చిత్ర హిం సలకు గురిచేశాడు. దీంతో ఎడారి దేశంలో తాను పడుతున్న చిత్రహింసలను వాట్సాప్ ద్వారా ఎమ్మెల్యే కేటీఆర్‌కు సదరు యువతి వివరించింది. తన గోడు వెల్లబోసుకుంది. దీనిపై వెం టనే స్పందించిన కేటీఆర్ ఈ విషయాన్ని ఏప్రిల్ 17న సౌదీ రాయబార కార్యాలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. లావణ్యను చిత్రహింసలకు గురిచేస్తున్న సదరు యజమానిపై సౌదీ రాయబార అధికారులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కేసు పూర్తికాకుండా యువతిని స్వదేశానికి పంపించాలంటే రూ.35వేలు చెల్లించాల్సి ఉండగా, సౌదీలోని సామాజిక కార్యకర్త శివాజీ చర్చలు అధికారులతో జరిపారు. ఖతార్‌లోని తెలంగాణ జాగృతి సభ్యుడు వికృతి రాజుగౌడ్ ఆర్థిక సహాయం అందించడంతో లావణ్య క్షేమం గా ఇంటికి చేరింది. కేటీఆర్ చొరవతో తమ కుమార్తె స్వదేశానికి తిరిగివచ్చిందని, ఆయనకు రుణపడి ఉంటామని బాధితులు పేర్కొన్నారు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...