బడిబాట వీడియోగీతం ఆవిష్కరణ


Thu,June 13, 2019 03:45 AM

రుద్రంగి: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో మండల కేంద్రానికి చెందిన ఉపాధ్యాయు డు మేడికాల అంజయ్య రూపొందించిన బడిబాట ప్రచార వీడియో గీతాన్ని ఆ మండల విద్యాధికారి సత్యనారాయణ బుధవారం ఆవిష్కరించారు. బాలలు రండి.. బడి సాగే ఈ గీతంలో ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న నాణ్యమైన విద్య, ఆంగ్ల మాధ్యమ విద్య, ఆటలు, ప్రాజెక్టుల నిర్వహణ, సన్నబియ్యంతో పౌష్టికాహారం, ఉచితంగా దుస్తులు, పుస్తకాలు వంటి పాటు అంశాలను కూర్చడం అందరినీ ఆకట్టుకుంటున్నది. ఈ సందర్భంగా మండల విద్యాధికారి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజ లను ఆలోచింపజేసేలా గీతం ఉందని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. పిల్లలను ప్రభుత్వ బడులకే పంపాలని కోరారు. బడిబాట ప్రచార వీడియో గీతం రూపొందించిన ఉపాధ్యాయుడు మేడికాల అంజయ్యను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో సర్పంచ్ సిరికొండ శ్రీనివాస్, ఎంపీటీసీ పులి రేణుక, ప్రధానోపాధ్యాయుడు తిరుపతి, విక్కుర్తి లక్ష్మీనారాయణ, యువజన సంఘాల నేతలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...