త్వరలోనే సింగరేణి పట్టాలు


Thu,June 13, 2019 03:44 AM

-డీఎంఎఫ్‌టీ నిధులతో పలు అభివృద్ధి పనులు
-సీఎం ప్రత్యేక కార్యదర్శి నర్సింగరావు
-కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేలతో భేటీపాల్గొన్న సింగరేణి సీఎండీ శ్రీధర్
గోదావరిఖని టౌన్ : సింగరేణి ప్రాంతంలో కార్మికులు, కార్మికేతరులు నిర్మించుకున్న ఇండ్లకు మరో దఫా పట్టాలను త్వరలోనే పంపిణీ చేయనున్నట్లు సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు తెలిపారు. ఈ మేరకు ఆయన కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేలతో రాష్ట్ర సచివాలయంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.శ్రీధర్ కూడా పాల్గొని, సింగరేణి పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం కేటాయించే నిధులు, వాటి వినియోగంతోపాటు ఇండ్ల పట్టాల మంజూరు విషయమై చర్చించారు.

పరిసర ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళిక
ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 ఫిబ్రవరిలో మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో సింగరేణీయుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కంపెనీ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకొని ఎంతోకాలంగా జీవిస్తున్న కార్మికులకు పట్టాలు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఇందుకుగాను సింగరేణి సంస్థ ప్రత్యేక చొరవ తీసుకుంది. కార్మికులు ఇండ్లు నిర్మించుకున్న కంపెనీ స్థలాలు గతంలో ప్రభుత్వం ద్వారా సింగరేణి సంస్థ మైనింగ్ కార్యకలాపాల కోసం కేటాయించినవి కా గా, అక్కడ పట్టాలు మంజూరు చేసే బాధ్యతను సంస్థ ఆయా జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. వీటితో పాటు ఖాళీగా ఉన్న సింగరేణి స్థలాలను గుర్తించి వాటిని కూడా ప్రభుత్వ అవసరాల వినియోగించాలని వారికి సూచించింది. ఇలా ఆరు జిల్లాల్లో కలిపి మొత్తం 1,713 ఎకరాల భూమిని తిరిగి సంబంధిత జిల్లా యంత్రాంగాలకు అప్పగించడంతో పట్టా లు పంపిణీకి మార్గం సుగమమైంది. తాజాగా ఈ అంశంపై సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలతో నర్సింగరావు ప్రత్యేకంగా సమీక్షించారు.

డీఎంఎఫ్‌టీ నిధుల వినియోగంపైన చర్చ..
సింగరేణి సంస్థ సమీప గ్రామాల అభివృద్ధి కోసం ఉద్దేశించిన డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ట్రస్ట్ కింద 2015 నుంచి ఇప్పటివరకు 1,844 కోట్లను సం స్థ ఆరు జిల్లాల్లో కలెక్టర్ల వద్ద డిపాజిట్ చేసింది. ఈ మొత్తంతో భారీ ఎత్తున సింగరేణి సమీప గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. ఈ నేప థ్యంలో బుధవారం నాటి సమావేశంలో ఆ నిధుల ను ఏయే పనులకు ఖర్చు చేయాలి? ఏ విషయా లకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలనే విషయాలపై కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేల నుంచి సూచనలు స్వీకరిం చారు. సింగరేణి పరిసర గ్రామాలు, పట్టణాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ఈ నిధులను సద్వినియోగం చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ రెవెన్యూ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ సుశీల్‌కుమార్, జాయింట్ డైరెక్టర్ రఫీక్ అహ్మద్‌తో పాటు సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వర్‌రావు (కొత్త గూడెం), గండ్ర వెంకటరమణారెడ్డి (భూపాలపల్లి), బాల్క సుమన్(చెన్నూరు), ఆత్రం సక్కు (ఆసి ఫాబాద్), రేగా కాంతారావు(పినపాక) తదితరులు పాల్గొన్నారు.

79
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...