పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ


Thu,June 13, 2019 03:44 AM

కాల్వశ్రీరాంపూర్: మండలంలోని లక్ష్మీపూర్‌లో ముదిరాజ్ కులస్తుల ఆరాధ్య దైవమైన పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠ , నూతన ఆలయ ప్రారంభోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా చేసుకున్నారు. వేదపండితుల మంత్రోత్సవాల మధ్య, అంగరంగ వైభవంగా విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి గ్రామంలో విగ్రహాలకు జలాభిషేకం, పాలాభిషేకం యంత్ర ప్రతిష్ఠాపన హోమా లు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణ మధ్య డప్పు చప్పుళ్లతో పెద్దమ్మతల్లి, పోతరాజు, పంచ పాండవులు ద్రౌపతి, జంపన్న విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ కులస్తులు మాట్లాడారు. నాలుగు రోజులపాటు అందరి సహకారంతో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నామని తెలిపారు. ఆలయ నిర్మాణానికి కృషి చేసిన అందరికీ పేరుపే రున కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు వీరేశం, సభ్యులు నల్లకొండిల్ల కనుకయ్య, లింగయ్య, నాగరాజు, అశోక్, నూనె సదయ్య, రమేశ్ కులస్తులు అధిక సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...