పీహెచ్‌సీలో వైద్య సేవల పరిశీలన


Wed,June 12, 2019 01:19 AM

సుల్తానాబాద్‌రూరల్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నాణ్యతాపరమైన వైద్య సేవలు అందిస్తున్నారా లేదా అనే విషయంపై ఎన్‌క్యూఏఎస్ బృందం పరిశీలన నిర్వహించింది. మండలంలోని గర్రెపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండార్డ్స్ (ఎన్‌క్యూఏఎస్) బృందం సభ్యులు రెండో రోజు మంగళవారం సందర్శించారు. ఇందులో భాగంగా వైద్యులు చేస్తున్న పనితీరును గమనించి, రోజు వచ్చే ఓపి వివరాలను పరిశీలించారు. షుగరు, టీబీ పరీక్షలు చేసే ల్యాబ్‌ను పరిశీలించారు. పీహెచ్‌సీకి వచ్చే రోగుల వివరాలను అడిగి తెలుసుకొని, వైద్యులు ఎలాంటి సేవలు అందిస్తున్నారనే విషయాలపై ఆరా తీశారు. కార్యక్ర మంలో ఎన్‌క్యూఏఎస్ సభ్యులు డాక్టర్ వీఎం. అగర్వాల్, డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి, రాష్ట్ర ప్రోగ్రామ్ ఆఫీసర్ జమునలు, పీహెచ్‌సీ వైద్యులు సంపత్, ల్యాబ్ టెక్నిషియన్ శ్రీనివాస్‌గౌడ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...