జడ్పీటీసీ దంపతులకు సన్మానం


Wed,June 12, 2019 01:18 AM

ధర్మారం: నూతనంగా ఎన్నికైన పలువురు ప్రజా ప్రతినిధులు మంగళవారం ధర్మారంలో అధికారులను మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు మండల పరిధిలోని నంది మేడారం గ్రామానికి చెందిన జిల్లా కో ఆప్షన్ సభ్యుడు ఎండీ సలామొద్దీన్, ఎంపీటీసీ -2 మిట్ట తిరుపతితో పాటు ధర్మారం గ్రామ సర్పంచ్ పూస్కూరు జితేందర్‌రావు, టీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేత ముత్యాల బలరాంరెడ్డి, నంది మేడారం సింగిల్ విండో చైర్మన్ పూస్కూరు నర్సింగారావు, నాయకులు కట్ట స్వామి, సామంతుల శంకర్,చింతల జగన్మోహన్‌రెడ్డి తదితరులు కలిసి రెవెన్యూ కార్యాలయంలో తాసీల్దార్ పి.సంపత్, నాయబ్ తాసీల్దార్ కల్లెం శ్రీనివాస్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన సదరు అధికారులకు నూతన ప్రజా ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తాసీల్దార్ సంపత్ నూతనంగా ఎన్నికైన జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ సలామొద్దీన్‌కు స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవల నూతనంగాఎన్నికైన జడ్పీటీసీ పూస్కూరు పద్మజ - జితేందర్‌రావు దంపతులను ఖిలావనపర్తి నూతన ఎంపీటీసీ మోతె సుజాత -కనకయ్య దంపతులు శాలువాతో సత్కరించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ధర్మారం 13వ వార్డు సభ్యురాలు దేవి రేణుక- రాజేందర్‌లు వారిని వారి సృగృహంలో సన్మానం చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మేడవేని తిరుపతి, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యుడు పాకాల రాజయ్య, పార్టీ ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు మద్దునాల వెంకటేశ్. గ్రామ శాఖ అధ్యక్షుడు కలవేని పెద్దులు తదితరులు పాల్గొన్నారు.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...