చెరువు మట్టి అక్రమ రవాణాపై చర్యలు తీసుకోండి


Wed,June 12, 2019 01:18 AM

-నీటి పారుదల ఎస్‌ఈ కార్యాలయ అధికారికి బీజేపీ నాయకుడి ఫిర్యాదు
కలెక్టరేట్: చెరువుల్లో పేరుకుపోయిన పూడిక మట్టిని వ్యాపారం కోసం ఇటుక బట్టీలకు అక్రమంగా రవాణా చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కరీంనగర్ నీటి పారుదలశాఖ ఎస్‌ఈ కార్యాలయంలోని అధికారికి బీజేపీ కిసాన్‌మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తంగెడ రాజేశ్వర్‌రావు ఫిర్యాదు చేశారు. పెద్దపల్లి డివిజన్‌లోని చెరువుల్లో పూడిక మట్టిని తరలించేందుకు ప్రభుత్వానికి క్యూబిక్ మీటర్ల చొప్పున చెల్లించాల్సిన మొత్తాన్ని కట్టకుండా అక్రమంగా తరలిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మైనిం గ్ శాఖ అధికారులు ఇచ్చిన వే బిల్లులను సక్రమంగా వాడకుండా వ్యాపారులు ఒకే వే బిల్లుపై అనేక ట్రిప్పు లు కొట్టుకుంటూ వేలాది క్యూబిక్ మీటర్ల మట్టిని బట్టీలకు చేరవేస్తున్నారని వివరిం చారు. ఈ విషయంపై సంబంధిత ఉన్నతాధికారులు దృష్టి సారించి చెరువు నుంచి ఇటుక బట్టీలకు తరలిస్తున్న మట్టి రవాణాపై నిఘా పెట్టాలనీ, ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీ డబ్బులు వసూలయ్యేలా చూడాలని వినతిలో పేర్కొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...