ఐదో విడత హరితహారానికి సమాయత్తం


Wed,June 12, 2019 01:18 AM

-పలు గ్రామాల్లో గుంతల తవ్వకం
-ప్రారంభించిన ప్రజాప్రతినిధులు
సుల్తానాబాద్‌రూరల్: హరితహారానికి అధికార యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. పలు గ్రామా ల్లో పనులు చేపడుతున్నది. ఈ సందర్భంగా గర్రెపల్లి, కొదురుపాక, తొగర్రాయిలతోపాటు పలు గ్రామాల్లో మంగళవారం మొక్కలను నాట్టేందుకు ఉపాధిహామి కూలీలతో గుంతలను తవే కార్యక్రమాన్ని చేపట్టారు. గర్రెపల్లిలో సర్పంచుల మం డల ఫోరం మండలాధ్యక్షురాలు వీరగోని సుజాత పెద్ద చెరువు కట్టకు ఇరువైపులా మొక్కలను నా ట్టేందుకు గుంతలను తవ్వే పనులను ప్రారంభించారు. కొదురుపాకలో నూతన ఎంపీపీ పొన్నమనేని బాలాజీరావు, తొగర్రాయిలో తు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు కోట రాంరెడ్డి గుంతలను తవ్వడం ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచులు దేవరనేని సాగర్‌రావు, కర్క తిరుమల, కోడం సురేఖ, ఆర్నకొండ రాజు, ఉపసర్పంచులు ఎల్లవేణి మధూకర్, శ్రీనివాస్, నాయకులు వీరగోని రమేశ్‌గౌడ్, కర్క శంకర్‌రెడ్డి, గ్రామపంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, వార్డు సభ్యులు అనిత, శేఖర్, నరేశ్, రజియా బీ తదితరులున్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...