పోల్ టెస్టుకు మరో అవకాశం ఇవ్వాలి


Wed,June 12, 2019 01:18 AM

కలెక్టరేట్: జూనియర్ లైన్‌మెన్ ఉద్యోగ నియామకాల్లో పోల్ టెస్టుకు మరో అవకాశం కల్పించాలని కోరుతూ కరీంనగర్ ఎస్‌ఈ కార్యాలయం ఎదుట మంగళవారం పలువురు అభ్యర్థులు నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2018 మార్చిలో విడుదలైన జూనియర్ లైన్‌మెన్ ఉద్యోగ జాబితాలో పరీక్ష రాసి మెరిట్ సాధించిన వారికి పోల్ టెస్టు పెట్టారని గుర్తు చేశా రు. ఆ టెస్టులో కరీంనగర్ ఎస్‌ఈ 2018 నోటిఫికేషన్‌లో లేని నిబంధనలు పెట్టి తాము ఇబ్బందు లకు గుర్యయేలా చేశారని ఆరోపించారు. ఉద్యోగం కోసం వెళ్లి ఎస్‌ఈ పెట్టిన అదనపు నిబంధనలతో తాము అవకాశాలు కోల్పోయామని చెప్పారు. తమకు మరోసారి పోల్ టెస్టు పెట్టి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. నిరసనలో బాలసాని లెనిన్, బొంకూరి నవీన్, అడప అశోక్, ఎస్‌కే అమాన్, పరికిపండ్ల గోపి, మందం కిశోర్ రాజు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...