ప్రభుత్వం ఆదుకోవాలి


Wed,June 12, 2019 01:18 AM

జూలపల్లి : పంచాయతీ వార్డు సభ్యుల కోర్కెలు నెరవేర్చి ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ పంచాయతీ ఉప సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు అడువాల తిరుపతి విజ్ఞప్తి చేశారు. మండల కేంద్రంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ, ఉప సర్పంచులకు జాయింట్ చెక్ పవర్ కట్టబెట్టాలనీ, గ్రామాలాభివృద్ధికి తోడ్పడాలని కోరారు. గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న వార్డు సభ్యులకు గౌరవ వేతనం ఇవ్వాలని పేర్కొన్నారు. బుధవారం జిల్లా ఉప సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో పలు సమస్యల పరిష్కారానికి కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేస్తామని తెలిపారు. ఇక్కడ నాయకులు కొప్పుల మహేశ్, రేశవేని సతీశ్, చొప్పరి నర్సింగం, బొజ్జ శ్రీనివాస్, కొత్త మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...