వ్యాపారులపై కేసు


Wed,June 12, 2019 01:17 AM

కలెక్టరేట్: బొంపల్లిలో పలువురు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి 12లక్షలు చెల్లించకుండా మోసం చేసిన ఇద్దరు వ్యాపారులపై కేసు నమోదు చేసినట్లు బసంత్‌నగర్ ఎస్‌ఐ ఉమాసాగర్ యాదవ్ తెలిపారు. బొంపల్లికి చెందిన పలువురు రైతుల నుంచి రైతు బోయిని శంకర్ మధ్యవర్తిత్వంతో తిరుపతిరెడ్డి, సతీశ్‌రెడ్డి అనే ఇద్దరు వ్యాపారులకు ధాన్యాన్ని విక్రయించారు. అందుకు సంబంధించిన రూ. 12లక్షలను రైతులకు చెల్లించాల్సి ఉండగా, చాలా రోజులుగా ఇబ్బందులకు గురి చేస్తుండడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...