ప్రజా సంక్షేమమే ధ్యేయం కావాలి


Tue,June 11, 2019 02:57 AM

-నమ్మకాన్ని వమ్ముచేయకుండా పనిచేయాలి
-రాజకీయాల్లో నీతి, నిబద్ధత అవసరం
-ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి
-నియోజకవర్గంలోని నూతన జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలకు ఘనసన్మానం
కలెక్టరేట్: వరుసగా జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీని ఆశీర్వదించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకూడదనీ, వారి సంక్షేమమే ధ్యేయంగా ప్రజాప్రతినిధులంతా పనిచేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలు, కో-ఆప్షన్ సభ్యులు, ఎంపీపీలు, జడ్పీటీసీలను జిల్లా కేంద్రంలోని ట్రినిటీ ఫార్మసి ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయాల్లో రాణించాలంటే నీతి, నిజాయతీతో కూడిన నిబద్ధత ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు.ప్రజల ముందు ఎంతటి వారైనా తప్పు చేస్తే తలవంచుకోవాల్సిందేనని పేర్కొన్నారు. వీటిని దృష్టి లో పెట్టుకుని ప్రజా సేవలో అవినీతి అక్రమాలకు ఆ స్కారం లేకుండా పని చేస్తేనే వారు ఆదరించి అక్కున చేర్చుకుంటారని వివరించారు. పార్టీ ఔన్నత్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రస్తుతం ఎంపికైన ప్రజాప్రతినిధులంతా ప్రజాసేవలో లీనమై పనిచేస్తే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని భవిష్యత్‌లో మరిన్ని అవకాశాలకు దగ్గరవుతారని తెలిపారు. అన్ని వర్గాలతో కలిసి ముందుకెళ్తేనే గ్రామాల్లో అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజాప్రతినిధులను సన్మానించిన సందర్భంగా టీఆర్‌ఎస్ పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డిని ప్రజాప్రతినిధులంతా కలిసి పుష్పగుచ్ఛం అందించి పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు కోట రాంరెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ మండిగ రేణుక, నాయకులు పాల రామారావు, గుర్రాల మల్లేశం, శ్రీగిరి శ్రీనివాస్, మర్కు లక్ష్మణ్, ఐరెడ్డి వెంకట్‌రెడ్డి, గోపు నారాయణరెడ్డి, ఆకుల మహేందర్, బుర్ర శ్రీనివాస్‌గౌడ్, గజవెల్లి పురుషోత్తం, కొట్టె రవీందర్, సాయిరి మహేందర్, తానిపర్తి మోహన్‌రావు, కొయ్యడ అరుణ్‌గౌడ్, బుర్ర శ్రీనివాస్‌గౌడ్, గుండేటి మధుయాదవ్, నూనేటి కుమార్‌యాదవ్, నిదానపురం దేవయ్య, కొట్టె రవీందర్ తదితరులున్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...