పీహెచ్‌సీకి ఎన్‌క్యూఏఎస్ బృందం


Tue,June 11, 2019 02:57 AM

సుల్తానాబాద్‌రూరల్: సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండార్డ్స్ (ఎన్‌క్యూఏఎస్) బృందం సభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీలో వైద్యం, వైద్యుల పనితీరును, పీహెచ్‌సీలో ఉన్నటువంటి సౌకర్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పీహెచ్‌సీలో ఇప్పటి వరకు ఎన్ని ప్రసవాలు జరిగాయనీ, సాధారణ ప్రసవాలు చేశారా, శస్త్ర చిక్సితలు చేశారని అనే విషయమై ఆరా తీశారు. ప్రసవం చేసే లేబర్ గదిని పరిశీలించారు. అందులో ఉన్న పరికరాలను పూర్తి స్థాయిలో చూశారు. పురుషులకు పీహెచ్‌సీలో కు.ని ఆపరేషన్ చేస్తున్నారా లేదా అని తెలుసుకున్నారు. షుగురు, బీపీ వ్యాధులు ఉన్నవారికి చేస్తున్న పరీక్షలు, ల్యాబ్‌లో చేస్తున్న షుగరు, తెమడ (టీబీ), సీబీపీ, మలేరియా, వైడల్, హెచ్‌ఐవీ, హెచ్‌బీఎస్ ఏజీ తదితర రక్త పరీక్షలు చేసే విధానాన్ని పరిశీలించారు. పాము, కుక్క కాటుకు వ్యాక్సిన్లు అందజేస్తున్నారా లేదా అనే అంశంపై ఆరా తీశారు. పీహెచ్‌సీలోని లేబర్ రూమ్, ఏసీ రూమ్, మందుల గది, కు.ని ఆపరేషన్ గది, పుట్టిన బిడ్డను వేడిగా ఉంచు గది (బేబీ వార్మర్), ఇంజక్షన్ ఇచ్చు గది, మినీ స్టోర్ రూమ్, వ్యాక్సిన్లను నిల్వ ఉంచే రిఫ్రిజిరేటర్ల గదులతో పాటు ప్రాథ మిక ఆరోగ్య కేంద్రం పరిసరాలను ఎన్‌క్యూఏఎస్ సభ్యులు డాక్టర్ అగర్వాల్, డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి, రాష్ట్ర ప్రోగ్రామ్ ఆఫీసర్ జమున పరిశీలించారు. వారి వెంట డీఎంహెచ్‌ఓ ప్రమోద్‌కుమార్, పీహెచ్‌సీ వైద్యులు సంపత్, ల్యాబ్ టెక్నిషియన్ శ్రీనివాస్‌గౌడ్, సిబ్బంది తదితరులున్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...