కొనుగోళ్లు శరవేగం


Mon,May 27, 2019 02:16 AM

కలెక్టరేట్ : జిల్లాలో యాసంగి కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఆరుగాలం కష్టించి పండిన పంట ఉత్పత్తులను మద్దతు ధరకు కొనుగోలు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, కలెక్టర్ శ్రీదేవసేన, జేసీ వనజాదేవి ఆధ్వర్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు సాఫీగా సాగుతున్నాయి. ఇప్పటిదాకా 2.20 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా, రైతులకు వెనువెంటనే డబ్బుల చెల్లింపు జరుగుతున్నది.

200 సెంటర్లలో కొనుగోళ్లు..
పండిన ప్రతి గింజనూ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. గతం లో మాదిరిగా కాకుండా రైతులపై భారాన్ని తగ్గించాలన్న ఉద్దేశ్యంతో మండలకేంద్రాలు, జిల్లా కేంద్రంలోనే కాకుండా ఊరూరా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వెనువెంటనే చెల్లింపులు జరిపేలా చర్యలు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక సహకార సంఘాల ఆధ్వర్యంలో 150, ఐకేపీ ద్వా రా మహిళా సంఘాల ఆధ్వర్యంలో 50.. మొత్తం 200 కొనుగోలు కేంద్రాల పరిధిలో ధాన్యం సేకరిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రేడ్ ఏ ధాన్యం రకానికి 1770, సాధారణ రకానికి 1750 మద్దతు ధర చెల్లిస్తున్నారు.

2.20 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు..
జిల్లావ్యాప్తంగా యాసంగిలో 1,00,420 ఎకరాల్లో వరి సాగు చేయగా, మొత్తం మూడు లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో దాదాపు 2.50 లక్షల మెట్రిక్ టన్నులు మార్కెట్‌లోకి అమ్మకానికి వస్తుందని లెక్కలేసుకున్నారు. అధికారుల అంచనాలకు తగ్గట్టుగా ఇప్పటివరకు 2,20,024 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి, వెనువెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు. అయితే జిల్లాలో 10వేల మంది కౌలు రైతులు ఉండడం, ట్రక్ షీట్ల అప్పగింతల్లో జాప్యం కారణంగా పలుచోట్ల చెల్లింపుల్లో జాప్యం జరుగుతున్నా, వెనువెంటనే అధిగమించి డబ్బులు వేస్తున్నారు. ఈ నెలాఖరులోగా కొనుగోళ్ల ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకుసాగుతున్నారు.

144కోట్ల చెల్లింపులు..
జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు 150 ప్రాథమిక సహకార సంఘాల ద్వారా 23,702 మంది రైతుల వద్ద 292.68 కోట్ల విలువ చేసే 1,65,499 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 50 ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా 8,664 మంది రైతుల నుంచి 96.45 కోట్ల విలువ చేసే 54,525 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. మొత్తం 200 కొనుగోలు కేంద్రాల ద్వారా 32,366 మంది రైతుల నుంచి 389.13 కోట్ల విలువ చేసే 2,20,024 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇందుకు గాను ఇప్పటి వరకు ప్రాథమిక సహకార సంఘాల పరిధిలో 8,887 మంది రైతులకు 110 కోట్ల చెల్లింపులు చేయగా, ఐకేపీ ద్వారా 2,689 మంది రైతులకు 34 కోట్లు చెల్లించారు.

ఇప్పటి దాకా..
జిల్లాలో ఐకేపీ, పీఏసీఎస్ ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి దాకా 2.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన అధికార యంత్రాంగం మరో ఐదువేల మెట్రిక్ ట న్నుల వరి ధాన్యం అమ్మకానికి రానున్నట్లు అంచనాకు వచ్చింది. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల్లో ని లువ ఉన్న కుప్పలను కలిపి ఐదువేల మెట్రిక్ టన్ను లు కొనుగోలు చేపట్టేందుకు చర్యలు చేపట్టింది. అందుకు అనుగుణంగా కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు.

గన్నీ సంచుల కొరత లేకుండా చర్యలు
జిల్లాలోని రైతులు పండించిన ధాన్యానికి సరిపడా గన్నీ సంచులను ఇప్పటికే అధికార యం త్రాంగం అందుబాటులో ఉంచింది. అయితే కొన్ని కట్టల్లో సంచులు శిథిలమై పోవడంతో కోల్‌కత్తా, బెంగుళూరు నుంచి ప్రత్యేకంగా గన్నీ సంచులను తెప్పిస్తున్నారు. జిల్లాలోని రైతాంగానికి సరిపడేందుకు వీలుగా 54,22,947 గన్నీ సంచులను తెప్పించారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...