సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ..


Mon,May 27, 2019 02:15 AM

పాలకుర్తి: మారేడుపల్లికి చెందిన మండల జ్యోతి(15) ఆదివారం ఇంట్లో సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ విద్యుదాఘాతంతో మృతిచెందింది. మండ ల స్వామి కూతురు జ్యోతి ఇంట్లో మల్టీచార్జింగ్ ప్లగ్‌లో సెల్‌ఫోన్ చార్జింగ్‌పెడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు చేతులకు కరెంటుషాక్‌వచ్చి కిందపడింది. వెంటనే కుటుంబీకులు ధర్మారంలోని దవాఖాన తరలించినా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. జ్యోతి ఇటీవలే పదో తరగతి ఫలితాల్లో 8.7 జీపీఏ సాధించింది. ఘ టన స్థలాన్ని ట్రాన్స్‌కో ఏఈ సుజిత్, బసంత్‌నగర్ ఎస్‌ఐ ఉమాసాగర్ సందర్శించి వివరాలు సేకరించారు. జ్యోతి తల్లి స్వరూప ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఉమాసాగర్ తెలిపారు. స్వరూప స్వామి దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. పెద్దకూతురు నర్సింగ్ చేస్తుండగా, రెండోకూతురు జ్యోతి. కూతు రు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు రోదించారు.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...