మహిమాన్వితం ఓదెల క్షేత్రం


Sun,May 26, 2019 12:01 AM

-మల్లన్న ఆశీస్సులతోనే దిగ్విజయంగా ఎన్నికలు
-ఆలయ అభివృద్ధికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతాం కలెక్టర్ శ్రీ దేవసేన
-ఎన్నికల పరిశీలకుడు రాజారాంతో కలిసి దర్శనం
ఓదెల : ఓదెల మల్లికార్జునస్వామి క్షేత్రం మహిమాన్వితమైనదని కలెక్టర్ శ్రీదేవసేన కొనియాడారు. శనివారం పార్లమెంట్ ఎన్నికల పెద్దపల్లి పరిశీలకుడు రాజారాంతో కలిసి కలెక్టర్ ఓదెల మల్లన్నను దర్శించుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ర్టానికి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి రాజారాం పార్లమెంట్ ఎన్నికల పరిశీలకుడిగా జిల్లాకు వచ్చారు. శనివారం తిరిగి ఉత్తరప్రదేశ్‌కు వెళ్తున్న సందర్భంగా జిల్లాలో చారిత్రక నేపథ్యం కలిగిన మల్లన్న ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు, జూనియర్ అసిస్టెంట్ ముద్దసాని కుమారస్వామి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మల్లికార్జునస్వామి, శ్రీసీతారాముల ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలెక్టర్, ఎన్నికల పరిశీలకుడు రాజారాంకు అర్చకులు స్వామి వారి జ్ఞాపికలను అందజేసి, ఆశీర్వచనం చేశారు.

అనంతరం కలెక్టర్ శ్రీదేవసేన మాట్లాడుతూ ఓదెల మల్లన్న ఆలయాన్ని చిన్న శ్రీశైలంగా పోల్చారు. శ్రీశైలంలోని మాదిరిగానే ఇక్కడ కూడా స్వామి వారు పోలి ఉన్నట్లు గుర్తు చేశారు. ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నదని చెప్పారు. మల్లన్న ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఇటీవల కాళేశ్వరం దేవాలయాన్ని సందర్శించిన సమయంలో వేములవాడ, ధర్మపురి, ఓదెల దేవాలయాలను కలుపుతూ పర్యటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారని కలెక్టర్ గుర్తు చేశారు. ఆలయానికి కొంత భూమిని కొనడానికి ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఓదెలను దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నదని చెప్పారు. మల్లన్న ఆశీస్సులతోనే ఇటీవలి ఎన్నికలు సజావుగా జరిగాయన్నారు. వీరి వెంట తాసిల్దార్ శ్రీకాంత్, వీఆర్‌ఓలు జీవన్, మల్లేశం తదితరులు ఉన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...