ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలి


Sun,May 26, 2019 12:01 AM

కలెక్టరేట్: జిల్లాలోని ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు చేసేందుకు ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ శ్రీదేవసేన తెలిపారు. జిల్లాతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిరుద్యోగ యువతీ, యువకు లకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 29న పెద్దపల్లి కలెక్టరేట్‌లోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో అపోలో హోం హెల్త్ కేర్ హైదరాబాద్ కంపెనీలో పని చేసేందుకు హోం కేర్ నర్సు ఉద్యోగాలు 50 పోస్టులకు బీఎస్సీ నర్సింగ్ చేసిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అలాగే నర్సింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలు 50 పోస్టులకు ఏఎన్‌ఎం, జీడీఏ చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.18 నుంచి 35లోపు వయసు ఉన్న స్త్రీ పురుషులు ఉద్యోగాలకు అర్హులన్నారు. ఈ నెల 29న నిర్వహించనున్న జాబ్‌మేళాలో అర్హులైన వారంతా హాజరై దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఉదయం 11 గంటలకు అన్ని సర్టిఫికెట్లు జిరాక్స్ కాపీలు, బయోడేటాతో హాజరుకావాలని కలెక్టర్ పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు సెల్: 82476 56356, 98858 24326లలో సంప్రదించాలని సూచించారు.

102
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...