మాతా శిశు మరణాలు తగ్గించాలి


Sun,May 26, 2019 12:00 AM

-కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి రాంమనోహర్‌రావు
-ఉమ్మడి జిల్లా వైద్యాధికారులతో ఓరియంటేషన్ వర్కుషాపు
కరీంనగర్ హెల్త్: మాతాశిశు మరణాలు తగ్గించేందుకు వైద్యులు, సిబ్బంది కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి రాంమనోహర్‌రావు అన్నారు. టీబీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజేశం ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల వైద్యాధికారులు, డిప్యూటీ డీఎంహెచ్‌లతో హైరిస్క్ కేసులపై శనివారం మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఓరియంటేషన్ వర్కుషాపు నిర్వహించారు. ఈ సందర్భంగా రాంమనోహర్‌రావు మాట్లాడుతూ, ఏ రోజు కేసులను ఆ రోజు ఆన్‌లైన్‌లో నమోదు చేసి ఏ ప్రాంతం నుంచి వస్తున్నారో ఆ వివరాలను పూర్తిగా మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి పంపించాలన్నారు. హైరిస్క్ కేసులను తప్పనిసరిగా మాతాశిశు ఆరోగ్య కేంద్రానికి తీసుకురావాలని పేర్కొన్నారు. కేసుల నమోదుకు ప్రత్యేక రిజిస్టర్‌ను పెట్టాలన్నారు. మాతా శిశు మరణాల రేటును తగ్గించడమే హైరిస్క్ కేసుల నమోదు ముఖ్య ఉద్దేశమన్నారు. ఉపకేంద్రం స్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు పర్యవేక్షిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటే మాతా శిశు మరణాల రేటును తగ్గించవచ్చన్నారు.

హైరిస్క్ కేసులను ఎమర్జన్సీ టైంలో తరలించాల్సి వస్తే 102, 108 వాహనాలు అందుబాటులో లేనట్లయితే ఉపకేంద్రంలో ఉన్న ఏఎన్‌ఎం, ఆశాల వద్ద రూ.2వేలు రవాణా ఖర్చులు ఉపయోగించుకోవచ్చునని, అలాగే పీహెచ్‌సీల నుంచి హైరిస్క్ కేసులను తరలించినట్లయితే వైద్యాధికారి వద్ద రూ. 5వేలు, ఏరియా హాస్పిటల్ నుంచి తరలిస్తే రూ. 10వేలు, ఎంసీహెచ్ నుంచి తరలిస్తే రూ. 15వేలు హైరిస్క్ కేసుల కోసం ఉపయోగించుకోవచ్చన్నారు. హైరిస్క్ కేసుల పరిస్థితి చేయిదాటితే ఎంసీహెచ్ కేంద్రానికి ప్రకటించకూడదన్నారు. ముఖ్యంగా రక్తహీనత, అధిక రక్తపోటు, మధుమేహంతోనే ఎక్కువ శాతం కేసులు నమోదవుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుజాత, ఎంసీహెచ్ ఇన్‌చార్జి డాక్టర్ మంజుల, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ రవిసింగ్, డాక్టర్ రాజమౌళి, ఎంసీహెచ్ అడ్మినిస్ట్రేటర్ అలీం, డాక్టర్ శీరిష, డాక్టర్ శ్రీనివాస్, దుర్గారావు, రవీందర్, తదితరులు పాల్గొన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...