చెరువుమట్టి తరలింపునకు అడ్డుకట్ట


Sun,May 26, 2019 12:00 AM

-నాలుగు వాహనాలు సీజ్
-అనుమతులు లేకుండా మట్టి తరలిస్తే కఠిన చర్యలు
-నీటిపారుదల, పోలీస్ అధికారులు
ఎలిగేడు(జూలపల్లి): ఎలిగేడు మండలం శివపల్లిలో శనివారం అనుమతులు లేకుండా అక్రమంగా చెరువులోని మట్టిని తరలిస్తున్న నాలుగు వాహనాలను అధికారులు పట్టుకున్నారు. పోలీస్, నీటి పారుదల శాఖ అధికారుల సంయుక్తంగా దాడులు నిర్వహించి అడ్డుకట్ట వేశారు. కరీంనగర్ మండలం చెర్లభూత్కూర్, చొప్పదండి మండలం వెదురుగట్ట గ్రామంలోని ఊర చెరువు నుంచి తీసిన మట్టిని వాహనాల ద్వారా శివపల్లి, సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామాల్లో ఇటుక బట్టిలకు తరలిస్తున్నారు. వెంటనే సమాచారం అందుకున్న అధికారులు ఇక్కడికి వచ్చి తనిఖీలు నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా పరిధిలో మట్టి తరలింపునకు అనుమతులు లేవని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో మట్టి తరలిస్తున్న నాలుగు టిప్పర్లను అధికారులు సీజ్ చేశారు. పట్టుబడిన వాహనాలను సుల్తానాబాద్ సీఐ మహేందర్‌రెడ్డికి అప్పగించినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతులు లేకుండా చెరువుల నుంచి మట్టి తవ్వినా, ఇటుక బట్టిలకు మట్టి తరలించినా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఇక్కడ పెద్దపల్లి నీటి పారుదల శాఖ డీఈ రవికాంత్, జేఈలు సుబ్బిరాంరెడ్డి, రమేశ్, పోలీసులు పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...