కార్పొరేట్ కళాశాలల్లో ప్రవేశానికి ఆహ్వానం


Sat,May 25, 2019 11:59 PM

పెద్దపల్లిటౌన్: జిల్లాలో 2019-20 విద్యా సంవత్సరానికి కార్పొరేట్ కళాశాలల్లో ప్రవేశానికి విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ సూపరింటెండెంట్ రమేశ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శనివారం నుంచి వచ్చే నెల 9 తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించి, జూన్ 13న ఎంపికైన వారి వివరాలు వెబ్‌సైట్‌లో పొందుపర్చనున్నట్లు వివరించారు. సర్టిఫికెట్ల పరిశీలన జూన్ 14 నుంచి 17 తేదీ దాకా కొనసాగ నుందని పేర్కొన్నారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ, ఈబీసీ విద్యార్థులు అన్ని ధ్రువీకరణ పత్రాలతో రిజిస్రేష్టన్ చేసుకుని ఎక్కువ శాతం మంది దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. పదో తరగతిలో 7.0 జీపీఏ ఆపై గ్రేడ్ జీపీఏ పొం దిన విద్యార్థులు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. కార్పొరేట్ కళాశాలలో ప్రవేశానికి ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలలు, తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాలలు, బెస్ట్ అవేలబుల్ స్కీమ్ కింద చదివిన విద్యార్థులు, తెలంగాణ ఆదర్శ పాఠశాలలు, క స్తూర్బా పాఠశాలల్లో చదివిన విద్యార్థులు మాత్రమే అర్హులన్నారు. http:// telangana epass.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా సంబంధిత ధ్రువపత్రాలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ, ఈబీసీ విద్యార్థులు దరఖాస్తులను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...