మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలి


Sat,May 25, 2019 11:59 PM

సుల్తానాబాద్‌రూరల్: గ్రామాల్లో విరివిరిగా మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామనీ, అందుకు అనుగుణంగా నర్సరీలో మొక్కల పెంపకం చర్యలు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి వేముల సుదర్శన్ ఆదేశించారు. మండలంలోని కాట్నపల్లిలో ఏర్పాటు చేసిన నర్సరీని డీపీఓ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా నర్సరీలో ఉన్న మొక్కల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నర్సరీలో 80వేల మొక్కలను పెంచుతున్నారు. అనంతరం డీపీఓ మాట్లాడుతూ, ఎండల తీవ్రతకు మొక్కల సంరక్షణ బా ధ్యతలను చేపట్టి ప్రతి దానిని బతికించుకునే విధంగా సిబ్బంది కృషి చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. వర్షాలు కురిసిన వెంటనే గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నామని పేర్కొన్నారు. దానిని దృష్టిలో ఉంచుకొని ఈజీఎస్ సిబ్బంది పనులు వేగవంతం చేయాలన్నారు. నర్సరీ పరిసరాలను పరిశీలించిన డీపీఓ సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట సర్పంచ్ మోరపల్లి మోహన్‌రెడ్డి, ఈఓపీఆర్డీ ఫియాజ్ అలీ, గ్రామ పంచాయతీ కార్యదర్శి నవీన్ చైతన్య, ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ శారద తదితరులు పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...