బీరన్న ఉత్సవాలు ప్రారంభం


Sat,May 25, 2019 11:59 PM

ధర్మారం: పెర్కపల్లిలో బీరన్న ఉత్సవాలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. గొల్ల, కుర్మ కులస్తుల ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు వారం రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈఉత్సవాలలో భాగంగా శనివారం గంగబోనంతో గ్రామం లో ఊరేగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. బోనం తో గొల్ల, కుర్మలంతా బీరయ్య గుడికి వెళ్లారు. అనంతరం గ్రామ శివారులోని ఓ బావి నుంచి బీరయ్య దేవుడి ప్రతిమను ఒగ్గు పూజారులు గుడికి తీసుకు వచ్చి ఉత్సవాలను ప్రారంభించా రు. ఈ నెల 27న బీరన్న కల్యాణం, 29 న నాగవెళ్లి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆ కుల పెద్దలు తెలిపారు.కార్యక్రమంలో సర్పంచ్ మొట్టె లక్ష్మి - శంకరయ్య, గొల్ల, కుర్మ పెద్దలు ఉన్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...