సంక్షేమ విజయం


Sat,May 25, 2019 02:48 AM

-పెద్దపల్లి గడ్డపై మరోసారి గులాబీ జెండా
-ఇటీవలి ఎన్నికల్లోనూ కారుకు పట్టం
-ఐదేళ్ల పాలన, ఇంటింటికీ సంక్షేమ ఫలాలతో టీఆర్‌ఎస్‌కే జైకొట్టిన ప్రజానీకం
-లోక్‌సభ ఎన్నికల్లో వెంకటేశ్‌నేతకు సంపూర్ణ మద్దతు
పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఐదేళ్ల క్రితం ఆవిర్భవించిన ప్రత్యేక రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికార పగ్గా లు చేపట్టింది. సర్కారు ఆది నుంచీ సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగింది. దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని వర్గాల అభ్యున్నతికి ఎన్నో పథకాలను తెచ్చింది. ముఖ్యంగా సీఎం రిలీఫ్ ఫండ్, ఆసరా పింఛన్లు, ఆహార భద్రత, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్స్, పట్టాదారు పాసు పుస్తకాలు, అన్ని వర్గాలకు సబ్సిడీ రుణాలు, కేజీ టూ పీజీ విద్య, స్వయం ఉపాధికి సబ్సిడీ రుణాలు, కుల వృత్తులను కాపాడేందుకు చేయూత, సబ్సిడీ గొర్రెలు, బర్రెలు, ఉచిత చేప పిల్లల పంపిణీ, సబ్సిడీ రుణాలు, వాహనాలు, ఇలా లెక్కకు మించిన పథకాలను పక్కాగా అమలు చేసింది. అప్పటి ఎమ్మెల్యేలు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందేలా చూశారు. అందుకే ప్రతి నియోజకవర్గంలో 70 శాతం మంది ఏదో ఒక పథకం కింద లబ్ధి పొందిన వారే ఉన్నారు. దాదాపు ప్రతి ఇంటిలోనూ ఒకరు కనిపిస్తున్నారు. ఇప్పుడు వీరంతా మునుపటితో పోలిస్తే ఎంతో సంతోషంగా ఉన్నారు. తమ ఇళ్లకు పెద్దదిక్కులా నిలుస్తున్న పథకాలతో ఆనందంగా జీవిస్తున్నారు. ముఖ్యంగా పండుటాకులు, ఒంటరి మహిళలు తమ కాళ్లపై నిలబడుతున్నా రు. మేనమామ కట్నం చదివించినట్లు కేసీఆర్ లక్ష నూ ట పదహార్లు ఇస్తుండడంతో ఆడపిల్లల తల్లిదండ్రులు సంబురంగా తమ పిల్లలకు పెళ్లిళ్లు చేస్తున్నారు. కులవృత్తులకు జీవం పోయడంతో అన్ని వర్గాల ప్రజలు సం బురపడుతున్నారు. నిరుద్యోగులకు స్వయం రుణాలు ఇవ్వడంతో స్వయం ఉపాధి పొందుతున్నారు. సబ్బండవర్గాల ప్రజలు ఏదో ఒక పథకం కింద లబ్ధి పొందుతూనే ఉన్నారు. అందుకే సందర్భం వచ్చిన ప్రతిసారి టీఆర్‌ఎస్ సర్కారుకు రుణపడి ఉంటామని చెబుతున్నారు. తాజాగా లోక్‌సభ ఎన్నికల్లోనూ గులాబీ జెం డాకు జై కొట్టారు. అభ్యర్థి వెంకటేశ్‌నేతకు సంపూర్ణ మద్దతు ప్రకటించి భారీ మెజార్టీతో గెలిపించారు.

అండగా రైతులు..
వ్యవసాయం దండగ అన్న చోటే ముఖ్యమంత్రి పండుగ చేసి చూపించారు. రైతును రాజును చేయాలనే లక్ష్యంతో అనేక పథకాలు ప్రవేశపెట్టారు. ప్రధానంగా 70 శాతానికిపైగా పల్లెల్లో ఉండే రైతుల కోసమే పథకాలు అమలు చేశారు. రుణమాఫీ, 24గంటల ఉచిత కరెంట్, రాయితీ రుణాలు, యంత్రాలు, తాజాగా రైతు బంధు ఇలా ఎన్నో తెచ్చారు. రైతు బంధు కింద పంట పెట్టుబడి సహాయం ఎకరానికి 4 వేలు రెండు పంటలకు 8 వేలు రైతులకు అందిస్తూ వ్యవసాయాన్ని పండుగలా మార్చారు. దానిని మరో వేయి పెంచి ఎకరానికి 10 వేలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. భూరికార్డులను ప్రక్షాళన చేసి దశబ్దాల తరబడిగా ఉన్న వివాదాలను పరిష్కరించారు. అక్కడితో ఆగకుండా ఇంటికి పెద్ద దిక్కైన రైతు ఏ కారణం చేతనైనా మరణిస్తే ఆ కుటుంబం దిక్కులేనిదవుతోందని గ్రహించి రైతుబంధు జీవిత బీమా పథకాన్ని అమలు చేసి దీమా కల్పించారు. ఇలా వ్యవసాయరంగాన్ని ప్రోత్సహిస్తూ నే, గ్రామీణ జీవనంతో ముడిపడిన కులవృత్తులకు జీ వం పోస్తున్నారు. ఇందులో భాగంగానే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపరిచారు. ఇలా పెద్దపల్లి సెగ్మెంట్ వ్యాప్తంగా మెజార్టీ ప్రజలు ఏదో ఒక పథకం కింద లబ్ధి పొందినవారే ఉన్నారు. అందుకే ఎన్నికలు వచ్చిన ప్రతిసారి టీఆర్‌ఎస్ సర్కారుకు అండగా ఉంటూ గులాబీ జెండాకు జై కొడుతున్నారు.

లోక్‌సభలోనూ కారుకే జై..
పెద్దపల్లి పార్లమెంట్ స్థానంలో ప్రజలు టీఆర్‌ఎస్‌కు రెండోసారి పట్టం కట్టారు. 2014లో పార్టీ అభ్యర్థి బాల్క సుమన్‌ను భారీ మెజార్టీతో గెలిపించారు. కేసీఆర్ ఐదేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో లబ్దిపొందిన ప్రజలు 2019లో సైతం పార్టీ అభ్యర్థినే భారీ మెజార్టీతో గెలిపించారు. పార్లమెంట్ పరిధిలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో మెజార్టీ సాధించారు. పార్టీకి వచ్చిన ఆధిక్యంలో అత్యధికంగా చెన్నూర్ నియోజకవర్గం నుంచే వచ్చింది. చెన్నూర్ నుంచి 31,723 ఓట్ల మెజార్టీ రాగా, బెల్లంపల్లి నియోజకవర్గంలో 19,890 ఓట్లు, మంచిర్యాలలో 15,158 ఓట్ల ఆధిక్యం రాగా, ధర్మపురి నియోజకవర్గంలో 24,672 ఓట్ల మెజార్టీ, పెద్దపల్లి నియోజకవర్గంలో 13,367 ఆధిక్యం వచ్చింది.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...