దరఖాస్తుల ఆహ్వానం


Sat,May 25, 2019 02:46 AM

జూలపల్లి : అంబేద్కర్, మహాత్మ జ్యోతిరావుఫూలే, భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం సేవారత్న అవార్డుల ఎంపిక కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా బహుజన సాహిత్య అకాడమీ సంస్థ మహిళా విభాగం అధ్యక్షురాలు సీపెల్లి శ్రావణి వెల్లడించారు. మండల కేంద్రంలో శుక్రవారం ఆమె విలేకర్లతో మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన సామాజిక ఉద్యమకారులు, కవులు, రచయితలు, గాయకులు, సంఘ సేవకులు దరఖాస్తు చేసు కునేందుకు అర్హులని వివరించారు. ఫూలే, అంబేద్కర్ సిద్ధాంతాల భావజాలంతో సమాజం కోసం పని చేసే అగ్రకులాల వ్యక్తులు అవార్డులు పొందడానికి దరఖాస్తులు సమర్పించవచ్చని సూచించారు. నిర్వాహకులు దరఖాస్తులు పరిశీలించి అవార్డులు ప్రకటిస్తారని వివరించారు. జూన్ 9న ఏపీలోని తిరుపతిలో రెండో దక్షిణ భారతదేశస్థాయి సదస్సు నిర్వహించనున్నారని తెలిపారు. ఇక్కడ ఆరు రాష్ర్టాల నుంచి 600 మంది ప్రతినిధులు హాజరుకానున్నారని వివరించారు. సేవారత్న అవార్డుల ఎంపికకు దరఖాస్తులు చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...