పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి


Sat,May 25, 2019 02:46 AM

- కాల్వశ్రీరాంపూర్ మండల సర్వసభ్య
సమావేశంలో ఎంపీపీ సారయ్యగౌడ్
కాల్వశ్రీరాంపూర్ : ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎంపీపీ గోపగాని సారయ్యగౌడ్ పిలుపునిచ్చారు. మండల పరిషత్ సర్వసభ్య సమావేశం శుక్రవారం ఎంపీపీ అధ్యక్షతన చేపట్టారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. అర్హులైన రైతులందరికీ రైతు బంధు పథకం వర్తించేలా చూడాలని పలువురు సభ్యులు సభ దృష్టికి తీసుకువచ్చారు. ఖరీఫ్ కాలానికి పచ్చిరొట్ట ఎరువులు అందుబాటులో ఉన్నాయనీ, వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏఓ నాగార్జున తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో రైతు సమగ్ర సర్వే కొనసాగుతున్నదని వివరించారు. దాదాపు 60శాతం పూర్తయినట్లు తెలిపారు. రెండో విడత గొర్రెల పంపిణీ వచ్చే జూన్‌లో ప్రారంభం కానుందని పశు వైద్యాధికారి సురేశ్ చెప్పారు. మీర్జంపేటలో పశు వైద్యశాల సబ్ సెంటర్ ఏర్పాటు చేయాలని కిష్టంపేట సర్పంచ్ కాసర్ల తిరుపతిరెడ్డి సభ దృష్టికి తీసుకువచ్చారు. మీర్జంపేట లో ఆశా కార్యకర్తలు సరిగా పనిచేయడంలేదంటూ వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలంటూ ఎంపీటీసీ సభ్యు డు పోశాల సదానందం ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న హరితహారం వచ్చే జూన్‌లో ప్రారంభం కానుందని, హరితహారం కార్యక్రమంలో అందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని అటవీశాఖ సెక్షన్ అధికారి సాహెబ్‌హుస్సేన్ కోరారు. ఇప్పలపల్లి, లక్ష్మీపూర్ గ్రామాల్లో మిషన్ భగీరథ పైప్ లైన్ పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయని అధికారులకు ఎన్ని సార్లుచెప్పినా పట్టించుకోవడం లేదంటూ ఆయా గ్రామాల సర్పంచులు సంబంధిత అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఇద్లాపూర్‌లో తాగునీటి ట్యాంకు వద్ద పెద్ద గుంత ఉండి అందులో నీళ్లు నిలుస్తున్నాయని వివరించారు.

ఆ గుంతను పూడ్చి వేయాలంటూ ఏఈ ప్రవళికకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ సర్పంచ్ దొంతరవేన రజిత పేర్కొన్నారు. ఈ విషయమై స్పందించిన ఎంపీపీ మాట్లాడుతూ నీటి ట్యాంకు వద్ద ఉన్న గుంతను వెంటనే పూడ్చి వేయాలని సూచించారు. సెర్ప్ ఆధ్వర్యంలో మండలంలో 7 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, 73,808 క్వింటాళ్ల వరి ధాన్యం కొనుగోలు చేశామని, 362 మంది రైతులకు 4కోట్ల 37లక్షలు చెల్లించినట్లు ఏపీఎం పద్మ తెలిపారు. మిగతా రైతులకు త్వరలో వారి ఖాతాలో డబ్బులు జమకానున్నట్లు చెపాపరు. భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా ఇప్పటి దాకా పెండింగ్‌లో ఉన్న దాదాపు 400 మంది రైతుల భూ సమస్యలను తాసీల్దార్ డిండిగాల రవీందర్ సహకారంతో పరిష్కరించామని డీటీ సుమన్ తెలిపారు. ఇంకా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ, ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు బాధ్యతాయుతంగా పని చేయాలని సూచించారు. గ్రామ పంచాయతీలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సర్పంచులను కోరారు. పెండింగ్ లో ఉన్న పంచాయతీ భవనాలు వెంటనే పూర్తి చేసి, తాగునీటి సమస్య రాకుండా చూడాలని సూచించారు. కార్యక్రమం లో ఎంపీడీఓ కిషన్, నాయబ్ తాసీల్దార్ సుమన్, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...