పొంచి ఉన్న ప్రమాదాలు


Sat,May 25, 2019 02:45 AM

ఓదెల: ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న చెరువుల వద్ద ప్రమాదాలు పొంచి ఉన్నా యి. పలు చెరువుల్లో ఎక్స్‌కవేటర్లతో పలువురు ఇష్టానుసారంగా అధికారులు, ప్రజాప్రతినిధుల కళ్లుగప్పి గుంతలు తీయడంతో తటాకాలు ప్రమాదక రంగా మారాయి. ఈ క్రమంలో ఈ నెల 4వ తేదీన కొలనూర్ ఊర చెరువులో ఈతకు వెళ్లిన సాత్తూరి రాజయ్య వృద్దుడితో పాటు పిల్లలు ఆదర్శ్, సిద్దార్థ, హర్షవర్ధన్ మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఓదెలలోని ఊర కుంట నీటిలో మునిగి ఏడవ తరగతి చదువుతున్న గడ్డం సృజన్ (13) ఏప్రిల్ 23వ తేదీన మృతి చెందా డు. అలాగే ఓదెలకు చెందిన పశువుల కాపరి చిలుముల మల్లయ్య(50) బహిర్భూమికి వెళ్లి మార్చి 20వ తేదీన మృతి చెందాడు. వీటన్నింటికీ కూడా చెరువులో ఎక్స్‌కవే టర్‌తో తీసిన గుంతలే కారణమని ప్రజలు పేర్కొంటున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, గ్రామ పంచాయతీ వారు కొలనూర్ గ్రామంలోని ఊర చెరువు, గ్రామం లోని పలు చోట్ల ప్రమాద హెచ్చరికల బోర్డులను ఏర్పాటు చేశారు. ఈత కోసం వెళ్లే వారితో పాటు పలువురు అమాయకులు మృతి చెందడాన్ని గమనించిన గ్రామపం చాయతీ పాలకవర్గాలు చెరువుల వద్ద హెచ్చరిక బోర్డులను పెట్టారు. చెరువు నీటిలోకి వెళ్ల వద్దని సూచిస్తున్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...