ఫీల్డ్ అసిస్టెంట్ నియామకాన్ని నిరసిస్తూ ధర్నా


Sat,May 25, 2019 02:45 AM

ఓదెల: ఇందుర్తిలో ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్ నియామకాన్ని నిరసిస్తూ ఉపాధి కూలీలు శుక్రవారం ధర్నా చేశారు. గతంలో ఇందుర్తిలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న కుమార్ మృతి చెందాడు. దీంతో కొంత కాలంగా ఉమాపతి ఫీల్డ్ అసిస్టెంట్‌గా తాత్కాలికంగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఇందుర్తి గ్రామ పంచాయతీ నుంచి కొత్తగా బాయమ్మపల్లి గ్రామపంచాయతీగా ఏర్పడింది. అయితే మేట్ల క్రమ సంఖ్య ప్రకారం బాయమ్మపల్లికి చెందిన శ్రీనివాస్ ఉన్నాడని అతడికి ఫీల్డ్ అసిస్టెంట్‌గా నియమించారు. ప్రస్తుతం ఫీల్డ్ అసిస్టెంట్‌గా చేస్తున్న ఇందుర్తికి చెందిన ఉమాపతినే కొనసాగించాలని ఉపాధి కూలీలు రోడ్డు ఎక్కి ధర్నా చేశారు. పోలీసులు ధర్నా వద్దకు చేరుకొని సర్ది చెప్పి ధర్నాను విరమింపజేశారు. మేట్ల సీరియల్ లిస్ట్ ప్రకారం ఉమాపతి 6వ స్థానంలో ఉండగా, అతడి కంటే ముందు వరుసలో ఉన్న శ్రీనివాస్‌ను నియమించామని ఏపీఓ కొమురయ్య వివరణ ఇచ్చారు.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...