హక్కుల పరిరక్షణే ధ్యేయంగా ముందుకు సాగాలి


Thu,May 23, 2019 01:58 AM

గోదావరిఖని టౌన్ : సింగరేణిలో ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణ ధ్యేయంగా ముందుకు సాగాలని సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కోరింది. ఈ మేరకు కేంద్ర కమిటీ అత్యవసర సమావేశం గోదావరిఖని కార్యాలయంలో నిర్వహించారు. సింగరేణిలోని అన్ని ఏరియాల ఉపాధ్యక్షుడు, కార్యదర్శులు, కేంద్ర కమిటీ సభ్యులు, ముఖ్య నాయకులు పాల్గొని పలు తీర్మానాలు చేశారు. ఇటీవల తలెత్తిన సమస్యలను చర్చించి అందరు ఐకమత్యంతో కలిసి పని చేయాలని తీర్మానించారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల హక్కుల పరిరక్షణ ధ్యేయంగా యాజమాన్యం సహకారంతో ముందుకు పోవాలని నిర్ణయించారు. గతంలో అధ్యక్ష పదవి విరమణ పొందిన కారణంగా స్థానంలో సిరికొండ సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా డా.రాజశేఖర్, కార్య నిర్వహక అధ్యక్షుడిగా గంగారపు లింగమూర్తి, వైస్ ప్రెసిడెంట్‌గా డప్పు కుమార్, భూపాలపల్లి ఏరియా ఉపాధ్యక్షుడిగా రేకుంట నర్సయ్య, కార్యదర్శిగా కుమారస్వామిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. జనగామ నర్సయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య సలహాదారు పులి మోహన్ కేంద్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...