స్వేరోస్‌పై ఆరోపణలు మానుకోవాలి


Thu,May 23, 2019 01:58 AM

పెద్దపల్లిటౌన్: స్వేరోస్ పై ఆరోపణలు మానుకోవాలని స్వేరోస్ జిల్లా అధ్యక్షుడు వేల్పుల సురేందర్, రాష్ట్ర కమిటీ సభ్యులు కన్నూరి శ్రీశైలం అన్నారు. బుధవారం పెద్దపల్లి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గురుకుల విద్యాలయాల్లో విద్యనభ్యసించిన పూర్ణ, ఆనంద్ ప్రపంచంలోనే అతి చిన్న వయసులో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారనీ, అత్యంత ప్రతిష్టాత్మకమైన అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీలో ఓపెన్ కేటగిరీల్లో పోటీ పడి చదువుతుంటే కొంత మంది కర్నె శ్రీశైలం లాంటి వారు స్వేరోస్‌పై ఆరోపణలు చేస్తూ ప్రచారం చేయడం మానుకో వాలని సూచించారు. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ గురుకుల పాఠశాలల నిర్వహణ చేపట్టిన నుంచి విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసిస్తూ ఉన్నతస్థానాలకు ఎదుగు తున్నారని వివరించారు. సమావేశంలో స్వేరోస్ బాధ్యులు కల్వల తిరుపతి, కారెంగుల శ్రీనివాస్, బెజ్జాల లక్ష్మణ్, దొడ్డె బాపు, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు కల్లెపల్లి అశోక్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు సీపెల్లి రవీందర్, శ్రావణ్, సాయికుమార్, సర్పంచ్ మామిడిపల్లి బాపయ్య తదితరులు పాల్గొన్నారు.
ధర్మారం: గురుకులాల కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌పై ఎస్సీ రిజర్వేషన్ల పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షుడు కర్నె శివాజీ చేసిన ఆరోపణలు అర్థరహితమని అంబేద్కర్ సంఘం మండల నాయకులు కాంపెల్లి చంద్ర శేఖర్, బొల్లి నందయ్య, సుంచు మల్లేశం, బోయిని మల్లేశం, పెర్క బాణేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శివాజీ వ్యాఖ్యలను ఖండించారు. ప్రవీణ్ కుమార్ చర్యలతో గురుకులాల్లో మంచి మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. విద్య బోధనతో పాటు భోజన వసతి, వసతులు కల్పించగా విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని వారు వివరించారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...