పలు గ్రామాల్లో అగ్ని ప్రమాదాలు


Thu,May 23, 2019 01:58 AM

ఓదెల: ఓదెల మండలం రూపునారాయణపేట, ఓదెల మల్లికార్జునస్వామి ఆలయ సమీపంలో బుధవారం అగ్ని ప్రమాదాల్లో భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఓదెల మల్లికార్జునస్వామి ఆలయ సమీపంలోని వ్యవసాయ భూముల్లో, రూ పునారాయణపేట మానేరు ఒడ్డుకు అగ్ని ప్రమాదాలు జరిగి వరి గడ్డి, కరంట్ మోటార్లు, పైప్‌లు, స్టార్టర్లు, తాటి, ఈత చెట్లు కాలిపోయాయి. మల్లన్న ఆలయ సమీపంలోకి మం టలు రావడంతో అప్రమత్తమైన ఆలయ సిబ్బంది నీళ్ల తో రాకుండా చర్యలు తీసుకున్నారు. మధ్యాహ్నం 2గంట ల ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరుగుతున్న సమయంలో సుడిగాలులు వీచడంతో భక్తులు భయాందోళనలు చెంది ప రుగులు తీశారు. సుడిగాలులకు కాలిన బూడిద, మంటలు పైకి ఎగురుతూ ఇతర ప్రాంతాలకు విస్తరించాయి. అలాగే రూపునారాయణపేటలో ఎస్సీ కాలనీ సమీపంలోకి మంట లు రావడంతో స్థానికులు రంగంలోకి దిగి విస్తరించకుండా చూశారు. పెద్దపల్లి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు కొసిన వరి పొలంలోని గడ్డి దగ్ధం చేసేందుకు నిప్పు పెడుతుండడంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నట్లు పలువురు పేర్కొంటున్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...