మల్యాలకు మంత్రి సతీమణి


Thu,May 23, 2019 01:58 AM

కాల్వశ్రీరాంపూర్ : రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సతీమణి ఉషాదయాకర్‌రావు తన స్వగ్రామమైన మండలంలోని మల్యాల గ్రామాన్ని బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా తనను చిన్నతనంలో పెంచిన అదే గ్రామానికి చెందిన పిన్నింటి లచ్చమ్మను పరామర్శించారు. పిన్నింటి లచ్చమ్మ అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకొని మల్యాలకు వచ్చారు. ఈ సందర్బంగా లచ్చమ్మ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. తను చిన్నతనంలో ఆడి పాడిన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. గ్రామంలో కలియ తిరుగుతూ, గ్రామస్తులతో మాట్లాడారు. చిన్న నాటి స్నేహితుల గురించి వాకబు చేశారు. మల్యాల ఆడపడుచు మంత్రి సతీమణి స్వగ్రామానికి రావడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆమెకు మంగళహారతులతో స్వాగతం పలికారు. మల్యాల గ్రామాభివృద్ధి కోసం మంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారమయ్యేలా చూస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. తన తండ్రి పొన్ననేని మురళీధర్‌రావు ఇంటి స్థలం గురించి ఆరా తీశారు. ఇక్కడ జడ్పీటీసీ లంక సదయ్య, సర్పంచ్ లంక రాజేశ్వరి, మాజీ సర్పంచ్ జక్కె రవీందర్, నాయకులు కాసర్ల మల్లారెడ్డి, పిన్నింటి తిరుపతిరెడ్డి, సంది సంజీవరెడ్డి, కూనారపు రమేశ్, వార్డు సభ్యులు తదితరులున్నారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...