జేఎన్టీయూలో మూడంచెల భద్రత


Thu,May 23, 2019 01:58 AM

రామగిరి : పెద్దపల్లి లోక్‌సభ ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద భారీ పోలీసు బందోబస్తుతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యానారాయణ తెలిపారు. ఈమేరకు మంథని జేఎన్టీయూ వద్ద ఏర్పాటుచేసిన లెక్కింపు కేంద్రాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా స్ట్రాంగ్‌రూముల్లోని ఈవీఎంలు, వీవీప్యాట్ల భద్రతపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ మొదటి వరుసలో ఉన్న పోలీసులు కౌంటింగ్ సిబ్బంది పాసులను తనిఖీ చేస్తారనీ, రెండో వరుసలో ఉన్న సిబ్బంది లెక్కింపు కేంద్రం చుట్టూ పహారా కాస్తారని పేర్కొన్నారు. సిబ్బంది ఎవరూ లోపలికి సెల్‌ఫోన్, ఇతర వస్తువులకు అనుమతి లేదని సీపీ స్పష్టంచేశారు. మూడవ వరుసలో వాహనాల పార్కింగ్ స్థలం, మీడియా సెంటర్, ఇతర వసతులు, సౌకర్యాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఇక్కడ గోదావరిఖని ఏసీపీ ఉమేందర్ పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...