పకడ్బందీగా కౌంటింగ్


Wed,May 22, 2019 03:17 AM

-ఎక్కడా ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు
-పర్యవేక్షణకు మరో ఇద్దరు పరిశీలకుల రాక
-సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
-సకాలంలో కేంద్రాలకు చేరుకోవాలి
-విలేకరులతో పెద్దపల్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ శ్రీ దేవసేన
-అంతకుముందు జేఎన్‌టీయూహెచ్‌లో ఏర్పాట్ల పరిశీలన
-మాక్ కౌంటింగ్, వెబ్‌సైట్‌లో ఫలితాల నమోదు రిహార్సల్, సిబ్బందికి పలు సూచనలు

కలెక్టరేట్ : పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి సంబంధించిన ఓట్ల లెక్కింపును పకడ్బందీగా చేపట్టాలని ఆర్‌ఓ, కలెక్టర్ శ్రీదేవసేన ఆదేశించారు. కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎన్నికల కౌంటింగ్‌పై మంగళవారం ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. లెక్కింపు ప్రక్రియను పరిశీలించేందుకు సాధారణ పరిశీలకుడు రాజారాంతోపాటు అదనంగా అజయ్‌కుమార్, సంజయ్‌కుమార్‌ను ఎన్నికల సంఘం నియమించిందన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన కౌంటింగ్ కోసం మంథని నియోజకవర్గ పరిధిలోని జేఎన్‌టీయూహెచ్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ హాళ్లు, ప్రతి కౌంటింగ్ హా ల్‌లో 14 టేబుళ్లు సిద్ధం చేశామని తెలిపారు.

పెద్దపల్లి, మంథని శాసనసభ నియోజకవర్గాల లెక్కిం పు 21 రౌండ్లలో, చెన్నూరు, బెల్లంపల్లి శాసనసభ నియోజకవర్గాల లెక్కింపు 16 రౌండ్లలో, మంచిర్యాల, ధర్మపురి నియోజకవర్గాల లెక్కింపు 20 రౌండ్లలో, రామగుండం నియోజకవర్గానికి 19 రౌండ్లలో లెక్కింపు జరుగుతుందని కలెక్టర్ వివరించారు. ఈ నెల 23న ఉదయం 8గంటల నుం చి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నా రు. అనంతరం పోస్టల్ బ్యాలెట్‌లోని 899 ఓట్ల ను లెక్కిస్తామన్నారు. ఇందుకోసం అదనంగా రెం డు టేబుళ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ నెల 23న ఉదయం 6.30 గంటలకు కౌంటింగ్ ఏజెం ట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ తెరుస్తామనీ, ఏజెంట్లందరూ నిర్ణీత సమయానికి అక్కడికి చేరుకోవాలని సూచించారు. ఉదయం 8.30 గంటలకు ఈవీఎంల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. అన్ని రౌండ్ల కౌంటింగ్ ప్రక్రియ ముగియగానే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌కు ఐదు పోలింగ్ కేంద్రాలను లాటరీ ద్వారా ఎంపిక చేసి, వీవీ ప్యాట్లలోని స్లిప్పులను లెక్కిస్తామన్నారు.

వీవీ ప్యాట్ల లెక్కింపు సజావుగా జరగడానికి హాల్‌లో వీవీ ప్యాట్ కౌంటింగ్ బూత్ ఏర్పాటు చేశామని తెలిపారు. కౌంటింగ్ కోసం మైక్రో పరిశీలకులు, కౌంటింగ్ సూపర్‌వైజర్లు, సహాయకులకు ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ప్రకారం శిక్షణ ఇచ్చామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా మంగళవారం మధ్యాహ్నం మాక్ కౌంటింగ్ నిర్వహించి, మరోసారి శిక్షణ అందించామన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు కౌంటింగ్ కేంద్రాల్లో అవసరమైన సాంకేతిక ఏర్పాట్లను పూర్తి చేశామని చెప్పారు. కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు 124 మంది కౌంటింగ్ సూపర్‌వైజర్లు, 127 మంది కౌంటింగ్ సహాయ సూపర్‌వైజర్లు, 131 మంది మైక్రో పరిశీలకులను నియమించామని తెలిపారు. వారందరినీ నియోజకవర్గాల వారీగా బుధవారం ఎన్నికల పరిశీలకుల సమక్షంలో ర్యాండమైజ్ చేస్తామనీ, కౌంటింగ్ రోజు ఉదయం ఐదు గంటలకు టేబుళ్ల వారీగా తదుపరి ర్యాంమైజ్ చేస్తామన్నారు. కౌంటింగ్ సందర్భంగా మీడియా వాళ్లందరికీ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామనీ, పౌర సంబంధాల అధికారితో కౌంటింగ్‌కు హాజరయ్యే ప్రతినిధులకు పాస్‌లను అందింస్తామని వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్టమై పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామనీ, 144 సెక్షన్ అమలులో ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వనజాదేవి తదితరులు పాల్గొన్నారు.

కౌంటింగ్ కేంద్రం పరిశీలన..
రామగిరి : పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ శ్రీదేవసేన ఆదేశించారు. మంగళవారం ఉదయం మంథని జేఎన్‌టీయూహెచ్‌లోని లోక్‌సభ కౌంటింగ్ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. సువిధ వెబ్‌సైట్‌లో ఫలితాలను నమోదు ప్రక్రియపై రిహార్సల్ చేపట్టారు. ఓట్ల లెక్కింపుపై కౌంటింగ్ సిబ్బందికి అవగాహన కల్పించి, మాక్ కౌంటింగ్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. కౌంటింగ్ కేంద్రాలకు సిబ్బంది సకాలంలో చేరుకోవాలనీ, ఉదయం 5 గంటల వరకే చేరుకునేలా ఏఆర్‌ఓల పరిధిలోని సిబ్బంది కోసం వాహనాలను ఏర్పాటు చేశామని తెలిపారు. కౌంటింగ్ హాల్‌లోకి మొబైల్ ఫోన్లను అనుమతించడం లేదన్నారు. ఎన్నికలను ప్రతి ఒక్కరూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారనీ, సిబ్బం ది జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. కౌంటింగ్‌లో సందేహాలు వస్తే వెంటనే ఏఆర్‌ఓల వద్ద నివృత్తి చేసుకోవాలని చెప్పారు. సిబ్బంది ఎవరితో ఎలాంటి సంభాషణలు జరపరాదనీ, ఎక్కడికీ వెళ్లడానికి వీలు లేదన్నారు. సిబ్బంది పూర్తి నిష్పక్షపాతంగా వ్యవహరించాలనీ, ఎవరికీ అనుకూలంగా లేదా వ్యతిరేకంగా వ్యవహరించకూడదని చెప్పారు. ఎన్నికల కమిష న్ మార్గదర్శకాల ప్రకారమే సిబ్బంది విధులు ని ర్వర్తించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేసీ వనజాదేవి, జగిత్యాల జేసీ రాజేశం, ఓఎస్డీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...