రంజాన్‌కు విస్తృత ఏర్పాట్లు


Tue,May 21, 2019 01:38 AM

-ఈద్గాలు, మసీదుల వద్ద విద్యుత్‌, నీటి సౌకర్యం కల్పించాలి
-జేసీ వనజాదేవి
కలెక్టరేట్‌ : మత సామరస్యానికి ప్రతీకగా ఉండే రంజాన్‌ పండుగ కోసం జిల్లాలో విస్తృత ఏర్పా ట్లు చేశామని జాయింట్‌ కలెక్టర్‌ వనజాదేవి తెలిపారు. కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం రంజాన్‌ పండుగ ఏర్పాట్లపై సంబంధిత అధికారులు, మసీద్‌ కమిటీల బాధ్యులు, ముస్లిం మత పెద్దలతో సమీక్షా సమావేశం ఏర్పా టు చేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ రంజాన్‌ పండుగ సందర్భంగా పెద్దపల్లి జిల్లాలోని అన్ని మసీదులు, ఈద్గాల వద్ద అవసరమైన ఏర్పా ట్లు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. పేదవర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పండు గ పూట ప్రతి పేద కుటుంబానికీ ప్రభుత్వం రం జాన్‌ గిఫ్ట్‌ ప్యాకులు అందజేస్తూ, ఇఫ్తార్‌ విందులను ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. ఇందుకోసం పెద్దపల్లి నియోజకవర్గానికి 1500, మంథ ని నియోజకవర్గానికి 1500, రామగుండం ని యోజకవర్గానికి 2వేల చొప్పున మొత్తం 5వేల గిప్ట్‌ ప్యాక్‌లను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు.

ఇఫ్తార్‌ విందుకోసం పెద్దపల్లి నియోజకవర్గానికి రూ.3లక్షలు, మంథని నియోజకవర్గానికి రూ. 3లక్షలు, రామగుండం నియోజకవర్గానికి రూ.4లక్షల చొప్పున మొత్తం రూ.10లక్షలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. మంథని నియోజకవర్గంలోని కొన్ని మండలాలు జయశంకర్‌ భూపాల్‌పల్లి జిల్లాలో ఉన్నప్పటికీ పాత నియోజకవర్గాల వారీగానే గిప్ట్‌ ప్యాక్‌లను పంపించడంతో పాటు అక్కడ కూడా రంజాన్‌కు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మసీదులు, ఈద్గాల వద్ద ప్రార్థనా సమయాల్లో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలనీ, తాగునీటి సౌకర్యంతో పాటు పారిశుధ్య పనులు చేపట్టాలని మున్సిపల్‌ అధికారులు, పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు.

జిల్లాలో రంజాన్‌ సందర్భంగా ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా శాంతిభద్రతలను అదుపులో ఉంచేందుకు పోలీసులు బందోబస్తు చర్యలను చేపట్టాలనీ, పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు. అర్హులకే గిప్ట్‌ ప్యాక్‌లు అందేలా మసీదు కమిటీలు చూసుకోవాలని చెప్పారు. పెద్దపల్లి, మంథని ప్రాంతాల్లో మూడు కేంద్రాల చొప్పున, రామగుండం ప్రాంతంలో నాలుగు కేంద్రాల్లో ఇఫ్తార్‌ విందులను ఏర్పాటు చేస్తామనీ, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 95 మసీదులను విద్యుద్ధీపాలతో అలంకరించి, వీధి దీపాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖాధికారి సుధాకర్‌, జిల్లా పంచాయతీ అధికారి వేముల సుదర్శన్‌, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ ప్ర మోద్‌కుమార్‌, జిల్లా పౌర సరఫరాల అధికారి తో ట వెంకటేశం, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్‌ అభిషేక్‌ సింగ్‌, ఏసీపీ వెంకటరమణారెడ్డి, రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌, పెద్దపల్లి మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసన్‌తోపాటు జిల్లా అధికారులు, ముస్లిం మత పెద్దలు, మసీదు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...