లెక్కింపును నిశితంగా పరిశీలించాలి


Tue,May 21, 2019 01:36 AM

జ్యోతినగర్‌ : పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్‌ పక్రియను మైక్రో పరిశీలకులు ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలించాలని జాయింట్‌ కలెక్టర్‌ వనజాదేవి సూచించారు. పార్లమెంటు ఎన్నికల లెక్కింపును పురస్కరించుకొని ఎన్టీపీసీ ఈడీసీ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన మై క్రో పరిశీలకుల శిక్షణ శిబిరానికి జేసీ హాజరయ్యా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలు ఈ నెల 23న వెలువడనుండగా, కౌటింగ్‌ పక్రియను సజావుగా జరిపేందుకు మైక్రో పరిశీలకులు కృషి చేయాలని కో రారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంటుకు సంబంధించి ఏర్పాటు చేసిన కౌటింగ్‌ హాళ్లలో ప్రతి టేబుల్‌ వద్ద కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌, కౌంటింగ్‌ అసిస్టెంట్‌, మైక్రో పరిశీలకులు వారివారి విధులను నిర్వహించాల్సి ఉంటుందన్నారు. కౌంటింగ్‌కు మొత్తం 131 మంది మైక్రో పరిశీలకులను నియమించామనీ, అందులో ఎ క్కువగా బ్యాంకు ఉద్యోగులు, ఎల్‌ఐసీ ఉద్యోగు లు ఉన్నారని, వారికి గతంలో విధులు నిర్వహించిన అనుభవం ఉందన్నారు. మైక్రో పరిశీలకులు వారికి కేటాయించిన టేబుళ్ల వద్ద విధులను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.

కౌంటిం గ్‌ సూపర్‌వైజర్‌ ఈవీఎంలలోని కంట్రోల్‌ యూనిట్‌లో ఫలితాలను చూపిన అనంతరం కేటాయించిన షీట్‌లో నోట్‌ చేసుకోవాలనీ, ప్రతి రౌండ్‌ ము గిసే వరకు ప్రతి టేబుల్‌ వద్ద ఫలితాలకు సంబంధించిన వివరాలతోపాటు కంట్రోల్‌ యూనిట్‌ సం ఖ్య, రౌండ్‌ సంఖ్య, టేబుళ్ల సంఖ్య, పోలింగ్‌ కేం ద్రం సంఖ్యను నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. రౌండ్‌ ముగిసిన అనంతరం వాటిపై సంతకం చేసి, సాధారణ ఎన్నికల పరిశీలకులకు అందజేయాలని జేసీ సూచించారు. ప్రతి కౌటింగ్‌ హాల్‌లో అదనంగా ఇద్దరు మైక్రో పరిశీలకులను నియమిస్తామన్నారు. అనంతరం మైక్రో పరిశీలకులకు కౌంటింగ్‌ విధులపై మాస్టర్‌ ట్రైనర్స్‌ అవగాహన కల్పించారు. జిల్లా సహకార అధికారి చంధ్రశేఖర్‌రెడ్డి, ఎల్‌డీఎం ప్రేమ్‌కుమార్‌, మాస్టర్‌ ట్రైనర్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...