‘పార్లమెంట్‌' కౌంటింగ్‌పై శిక్షణ


Tue,May 21, 2019 01:36 AM

కలెక్టరేట్‌ : పార్లమెంట్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో సోమవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించగా, కలెక్టర్‌ శ్రీదేవసేన సం బంధిత అధికారులతో కలిసి పాల్గొన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల రి టర్నింగ్‌ అధికారులు, సహాయ రిటర్నింగ్‌ అధికారులకు ఓట్ల లెక్కింపుపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎన్నికల కౌంటింగ్‌ కేంద్రాల వద్ద బందోబస్తు, లెక్కింపునకు సంబంధించిన అంశాలపై ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ వివరాలను అడిగి తెలుసుకున్నారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద సకాలంలో ఓట్ల లెక్కింపు ప్రారంభించాలనీ, కౌం టింగ్‌ కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి సంబంధించి ఐదు ఈవీఎంల వీవీ ప్యాట్‌లను లెక్కించాల్సి ఉంటుందన్నారు. లెక్కింపు సందర్భంగా కూలర్లు, ఫ్యాన్లు ఉండకుండా చర్యలు తీసుకోవాలనీ, వాటికి ప్రత్యామ్నాయంగా ఏసీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వీవీ ప్యాట్‌ల లెక్కింపు తర్వాత కౌంటింగ్‌ ఏజెంట్ల సంతకాలు తీసుకోవాలన్నారు. కౌంటింగ్‌ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎన్నికల కమిషన్‌ సభ్యులు అధికారులకు వివరించారు. రౌండ్ల వారీగా కౌంటింగ్‌ ముగిసిన అనంతరం ఎలాంటి పొరపాట్లు లేకుండా ఆ వివరాలను స్వయంగా రిటర్నింగ్‌ అధికారి మాత్రమే నమోదు చేయాలనీ, అనంతరం ఆయా ఫలితాల ను బయటకు విడుదల చేయాలని తెలిపారు. కౌం టింగ్‌ నిర్వహించే సందర్భంలో వచ్చే సవాళ్లను ఎదుర్కొంటూ వాటి పరిష్కారం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను రిటర్నింగ్‌ అధికారులకు, ఏఆర్‌వోలకు శిక్షణ ద్వారా వివరించారు. ఆర్వోలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...