క్రీడల్లో జాతీయ స్థాయిలో రాణించాలి


Sun,May 19, 2019 02:14 AM

గోదావరిఖని టౌన్ : జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ క్రీడల్లో బంగారు పతకాల సాధనే లక్ష్యంగా క్రీడాకారులు సాధన చేయాలని రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ బి.శ్రీనివాస రావు పేర్కొన్నారు. గోదావరిఖని డిగ్రీ కళాశాలలో ఎన్టీపీసీ సీఎస్‌ఆర్, విజయమ్మ ఫౌండేషన్ సౌజన్యంతో రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి ఉచిత క్రీడా శిక్షణ శిబిరాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ శిబిరంలో రన్నింగ్, డిస్కస్‌త్రో, తైక్వాండో, వెయిట్ లిఫ్టింగ్ మాత్రమే కాకుండా ఆధునిక ఫుట్‌బాల్, టెన్నీస్ ఆటల్లో కూడా శిక్షణ అవకాశం కల్పిస్తామని తెలిపారు. క్రీడాకారులకు పౌష్ఠికాహారం కూడా అందించేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. ప్రతిభ కనబర్చిన ఔత్సాహిక క్రీడాకారులను జాతీయ స్థాయిలో ఎదిగేలా ప్రోత్సహిస్తామని ఆయన తెలిపారు. ఔత్సాహిక క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి ప్రపంచానికి చూపించడానికి ఈ క్రీడా శిబిరంఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ శిబిరంలో పాల్గొనడానికి ఇంకా ఆసక్తి గల క్రీడాకారులు వారివారి పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. ఈ శిక్షణ శిబిరంలో 50 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ దాదా సలాం, శిక్షకులు దామెర శంకర్, కరాటే మొండయ్య, కళావతి, సత్యవతి, అనిల్, శాంత, విజయ, మనోజ్, లక్ష్మణ్, గౌతమ్, ఆనంద్, సలీం, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...