వైభవంగా వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం


Sun,May 19, 2019 02:14 AM

రామగుండం రూరల్ : రామునిగుండాల కొండపై శనివారం వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ 13వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి మేడి తిరుపతి ఆధ్వర్యంలో గుట్టపై స్వామి కల్యాణోత్సవం నిర్వహించారు. మాడవీధుల్లో పల్లకిలో స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. ఇక్కడ కోలాట బృందం సభ్యులు నృత్యాలు చేశారు. జగన్నాధాచార్యులు, భానుకుమార్ కల్యాణోత్సవాన్ని నిర్వహించగా, ఎండను సైతం లెక్కచేయకుండా భక్తులు కాలినడకన గుట్టకు చేరుకున్నారు. కల్యాణోత్సవం అనంతరం అన్నదానం ఏర్పాటుచేశారు. 2వ డివిజన్ కార్పొరేటర్ నస్రీన్‌బేగం మహ్మద్ భక్తులకు తాగునీరు సరఫరా చేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు కె.శివప్రసాద్, కె.నరేశ్, కొయ్యడ రాములు, రవీందర్‌గౌడ్, మహేందర్‌రెడ్డి, సంజీవరెడ్డి, లింగయ్య, శ్రీనివాస్, శ్రీధర్ పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...