ఎన్టీపీసీలో సీఎం కేసీఆర్


Sun,May 19, 2019 02:14 AM

జ్యోతినగర్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్టీపీసీలో పర్యటించారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో సాయంత్రం 4.07 గంటలకు ఎన్టీపీసీ టౌన్‌షిప్‌లోని వీఐపీ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్ 5.12 గం.లకు 1600 మెగావాట్ల తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టుకు వెళ్లి నిర్మాణం పనులను పరిశీలించారు. అనంతరం 5.24 గంటలకు నేరుగా ఎన్టీపీసీ పరిపాలన భవనంకు విచ్చేసి ఎన్టీపీసీ, జెన్‌కో, సింగరేణి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ ప్రాజెక్టు నిర్మాణం పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. కాళేశ్వరం నిర్మాణం పూర్తవుతుందనీ, ప్రతి రోజూ 2 టీఎంసీల చొప్పున నీటిని ఎత్తిపోసేందుకు తెలంగాణ ప్రాజెక్టు విద్యుత్ అవసరమవుతుందనీ, అందుకు ఎన్టీపీసీ సహకరించి ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలన్నారు. ఆ తర్వాత, సీఎం తిరిగి 6.40 గంటలకు వీఐపీ గెస్ట్‌హౌస్‌కు చేరుకొని రాత్రి ఇక్కడే బస చేశారు. పర్యటనలో సీఎం వెంట ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, మంత్రి కొప్పుల ఈశ్వర్, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, ఎన్టీపీసీ సీఎండీ గురుదీప్ సింగ్, సదరన్ రీజియన్ ఈడీ దిలీప్‌కుమార్ దూబే, తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు, సింగరేణి సీఎండీ శ్రీధర్, జిల్లా కలెక్టర్ దేవసేన, రామగుండం, పెద్దపల్లి ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, దాసరి మనోహర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ తుల ఉమ ఉన్నారు.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...