శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర


Sun,May 19, 2019 02:14 AM

ధర్మారం: ధర్మారం మండలం పత్తిపాకలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జాతర మహోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. నాలుగు రోజుల నుంచి ఇక్కడ స్వామి వారి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. చివరి రోజు ఆలయం వద్ద జాతర ఉత్సవాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గుట్ట కింద ఉన్న రథంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి సతీ సమే త ఉత్సవ విగ్రహాలను పెట్టి భక్తులు లాగడంతో జాతర ప్రారంభమైంది. భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. రథాన్ని లాగిన అనంతరం ఉత్సవ విగ్రహాలను భక్తులు, అర్చకులు ఆలయంలో ప్రతిష్ఠించారు. అనంతరం ఆలయం వద్ద భక్తులు కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామి వారికి ఎదురు మొక్కులు మొక్కి మేక పోతులు, కోళ్లను బలి ఇచ్చారు. కార్యక్రమంలో పత్తిపాక, నాయకంపల్లి సర్పంచులు బద్దం సుజాత, భూక్య లావణ్య, ఎంపీటీసీ సభ్యురాలు నోముల పుష్పలత, ఉప సర్పంచులు బండారి శ్రీనివాస్, నునావత్ శ్యామల, ఏఎంసీ వైస్ చైర్మన్ గూడూరి లక్ష్మణ్, వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్ నీలం నర్సయ్య, ఆలయ ధర్మ కర్తలు, టీఆర్‌ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కోయెడ రవీందర్, నాయకులు నోముల వెంకట రెడ్డి, బద్దం రవీందర్‌రెడ్డి, బద్దం మోహన్‌రెడ్డి, మెన్నేని వెంకటేశ్వర్ రావు, మెన్నేని రాంబాబు, ఏదుల్ల రాజారాం, ఏదుల్ల ప్రభాకర్ తదితరులున్నారు.

దర్శించుకున్న హైకోర్టు అడ్వకేట్
ధర్మారం మండలం ఖిలావనపర్తిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని హైకోర్టు అడ్వకేట్ ఆకుల జనార్దన్ దర్శించుకున్నారు. ఇక్కడ జాతర మహోత్సవాలు జరిగేందుకు ఏర్పాట్లు పూర్తయినట్లు తెలియడంతో అడ్వకేట్, ఆయన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని, ప్రత్యేక పూజ లు నిర్వహించారు. అర్చకులు ఆయన హారతి ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...